- -స్థానిక ఎన్నికల రగడ
- -ఎస్ఈసీకి టీడీపీపై ఫిర్యాదు చేసిన లేళ్ల అప్పిరెడ్డి
- -పన్నులు మినహాయింపు అంటూ మభ్యపెడుతోందని ఆరోపణ
- -ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తోందని వ్యాఖ్య
వైసీపీ ప్రధాన కార్యాలయం ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ప్రజలను టీడీపీ మభ్యపెడుతోందని, మిస్డ్ కాల్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పన్ను మినహాయింపులు అని ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఇది ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ను కోరారు.
బినామీల మేలు కోసమే చంద్రబాబు తాపత్రయం: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. రైతుల పాదయాత్ర ముసుగులో టీడీపీ రాజకీయ యాత్ర చేస్తోందని ఆరోపించారు. బినామీలకు లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు మారడంలేదని విమర్శించారు. ఏపీ శాసన రాజధాని ఎప్పటికీ అమరావతేనని, అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. రాజధాని అంశంలో చంద్రబాబు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
అభ్యర్థులు కోర్టుకు వెళితే మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది: చంద్రబాబు
- స్థానిక ఎన్నికలపై చంద్రబాబు స్పందన
- దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
- బలవంతపు నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని ఆరోపణ
- సంతకాలు ఫోర్జరీ అని తేలాయని వ్యాఖ్య
నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు ఫోర్జరీ అని న్యాయస్థానంలో తేలిందని అన్నారు. ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.