Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం-సీబీఐ

-పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం-సీబీఐ
-ఇంటర్ పోల్ బ్లూ నోటీసు జారీ- మరో నిందితుడికీ
-హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టుల ఫలితం
-ఇంటర్ పోల్ అధికారుల ద్వారా వివిధ దేశాలలో గాలింపు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, వారి తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ పై సీబీఐ వల విసురుతోంది. ఈ కేసులో పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇవాళ ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటర్ పోల్ అధికారులు వివిధ దేశాల్లో గాలింపు చేపట్టబోతున్నారు.

పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం సీబీఐ ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. పంచ్ ప్రభాకర్ తో పాటుగా విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడికి కూడా సిబిఐ అధికారులు బ్లూ నోటీస్ జారీ చేసింది. హైకోర్టు జడ్డీలపై దూషణలు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ పదకొండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశాలలో ఉన్న నిందితులపై అరెస్ట్ వారెంట్లు జారీచేసి, వారిని అరెస్టు చేయడానికి దౌత్య ఛానెళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించబడిందని సీబీఐ ప్రకటన విడుదల చేసింది. న్యాయమూర్తులు మరియు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లు పెట్టడానికి సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిపై సీబీఐ ప్రత్యేక ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా పలుప తీర్పులు రావడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ సానుభూతిపరులు హైకోర్టుతో పాటు తీర్పులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… తొలుత సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. కానీ సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయకపోవడంతో సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ కూడా వైసీపీ నేతలపై దూకుడుగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో తాజాగా హైకోర్టు సీబీఐపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ ఇంటర్ పోల్ నోటీసు జారీ చేసింది.

Related posts

బాపట్ల వద్ద పూర్తిగా తీరాన్ని దాటిన మిగ్జామ్ తుపాను

Ram Narayana

వైద్యరంగంలో విప్లవం ….ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ !

Drukpadam

కెనడాలో 700 మంది భారత విద్యార్థుల ఆందోళన…!

Drukpadam

Leave a Comment