Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్!

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్!
కిషన్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు
మెడికల్ కాలేజీల అంశంపై మాటల యుద్ధం
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి మాటల్లో నిజం ఎంత? అంటూ హరీశ్ రావు ట్వీట్

కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి ,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ ,టీఆర్ యస్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం కొంగలు , జలజగడాలు , రాష్ట్రాల వాట , చమురు ధరలు ఒకటేమిటి అనేక రకాల పంచాయతీలు ఉన్నాయి. ప్రతిజిల్లాకు మెడికల్ కళాశాలలు ఇస్తానని హామీనిచ్చిన కేంద్రం తెలంగాణాలో ఒక్క కళాశాల కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అందుకు బీజేపీ నుంచి పిన్ పాయింట్ సమాధానం లేదు కానీ రాష్ట్రానికి ఇవ్వలసినదానికన్నా ఎక్కువే ఇచ్చామని బుకాయిస్తుందనే విమర్శలను టీఆర్ యస్ చేస్తుంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ భాద్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు కేంద్రం మెడికల్ కళాశాలల వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం ,కరీంనగర్ కళాశాలకు లేఖలు రాస్తే కేంద్రం ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు.

తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశంపై కేంద్రం పంపిన లేఖకు రాష్ట్ర సర్కారు స్పందించడంలేదని, పైగా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. వాస్తవాలు ఇవిగో అంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.

2015 జూన్ 21న జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా ఉన్నతీకరించాలంటూ అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కు తెలంగాణ సర్కారు లేఖ రాసిందని హరీశ్ రావు తెలిపారు. అయితే కేంద్రీయ ప్రాయోజిత పథకంలో భాగంగా జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర క్యాబినెట్ గుర్తించిన జాబితాలో తెలంగాణ ఆసుపత్రులు లేవని నడ్డా ప్రత్యుత్తరం ఇచ్చారని వివరించారు.

2019లో అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు కూడా ఇదే విషయమై లేఖ రాశామని హరీశ్ రావు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని కోరినట్టు పేర్కొన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ తమ లేఖలోని అంశాలను పరిశీలిస్తామని చెబుతూ లేఖ రాశారే తప్ప, ఇంతవరకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. అంతేకాదు, కేంద్రం నుంచి తమకు వచ్చిన లేఖల ప్రతులను కూడా హరీశ్ రావు ట్విట్టర్ లో పంచుకున్నారు.

Related posts

తాలిబన్లు చంపినా ఆలయం వదలను: ఆఫ్ఘన్‌లోని హిందూ పూజారి!

Drukpadam

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

Drukpadam

నాణ్యత కోసం నూతన టెక్నాలజీ ఉపయోగించు కోవాలి:మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

Leave a Comment