Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం కేంద్రం వద్ద అడుక్కుంటున్నారని విమర్శలు
రావాల్సిన నిధులను అడుగుతున్నామన్న పేర్ని నాని
మా మీద పడి ఏడవడం ఎందుకంటూ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం నిధులే ఆధారమని, కేంద్రం వద్ద ఏపీ సీఎం బిచ్చమెత్తుకుంటున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. నిధుల కోసం మేం కేంద్రం వద్ద అడుక్కుంటున్నామా… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీకి వెళుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మీకు కేంద్రంపై కోపం ఉంటే ఏపీ మీద పడి ఏడవడం ఎందుకు? అని నాని ప్రశ్నించారు.

“మాకు రావాల్సిన నిధుల కోసమే కేంద్రాన్ని అడుగుతున్నాం. ప్రజాప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతేతప్ప ఇందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. మీలాగా బయట కాలర్ ఎగరేస్తూ లోపల కాళ్లు పట్టుకోము. అది జగన్ తత్వం కానే కాదు. తెలంగాణ అంత ధనిక రాష్ట్రం అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి” అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

అంతేకాదు హైదరాబాదు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను సమష్టిగా అభివృద్ధి చేశారని, కానీ హైదరాబాద్ నుంచి అందుతున్న ఆదాయంతో ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు బాగుపడుతున్నారని అన్నారు.

ఏపీ సీఎం పై తెలంగాణ మంత్రి ప్రశాంత రెడ్డి ఏమన్నారు ?

డబ్బులు లేక ఏపీ సీఎం కేంద్రం వద్ద అడుక్కుంటున్నారు .తెలంగాణ వస్తే అడుక్కుంటారన్న వాళ్లే ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారని ఏపీ నడవాలంటే కేంద్ర నిధులు కావాలని కేంద్రం ఒత్తిడితోనే ఏపీ ప్రభుత్వం రైతులకు మీటర్లు బిగించింది ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలని అన్నారు.

కేంద్రం ఒత్తిడితోనే రైతుల వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం కొత్త మీటర్లు బిగించిందని చెప్పారు. దేశం మొత్తంలో రైతుల మోటార్లకు మీటర్లను బిగించాలనేది మోదీ ఆలోచన అని… తెలంగాణలో మాత్రం మీటర్లు పెట్టబోమని అన్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం చాలా మోసం చేస్తోందని… బీజేపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకోవాలని చెప్పారు. బీజేపీ బట్టెబాజ్, లఫంగి గాళ్లకు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని ప్రశ్నించారు.

Related posts

రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ వ్యాఖ్యలపై స్పందించిన సోనియా గాంధీ!

Drukpadam

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

Drukpadam

చేతులెత్తేసిన ప్రతిపక్షాలు.. నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి!

Drukpadam

Leave a Comment