Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నా భర్త చేసిన నేరం ఏమిటి?.. ఆయనను వెంటనే విడుదల చేయాలి: ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య

నాభర్త చేసిన నేరం ఏమిటి ? పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య
-మా ప్రింటింగ్ ప్రెస్ పై నిన్న 50 మంది పోలీసులు దాడి చేశారు
-కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, ప్రింట్ అయిన పుస్తకాలను తీసుకెళ్లారు
-నా భర్తపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలి

తన భర్త రామకృష్ణారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) అధ్యక్షురాలు సంధ్య డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో నవ్య ప్రింటింగ్ ప్రెస్ కు పోలీసులు వచ్చి తనిఖీలు చేశారని చెప్పారు. దాదాపు 50 మంది పోలీసులు బీభత్సం సృష్టించారని మండిపడ్డారు. ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, ప్రింట్ అయిన పుస్తకాలను అక్కడి నుంచి తీసుకెళ్లారని అన్నారు. తన భర్తను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారని తెలిపారు.

తన భర్త చేసిన తప్పేంటని సంధ్య ప్రశ్నించారు. దివంగత ఆర్కే భార్య ఆమె భర్త జ్ఞాపకార్థం ఒక బుక్ ప్రింట్ చేయమని ఇచ్చారని… ఆ బుక్ ను తమ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ తో ప్రింట్ చేశామని తెలిపారు. ఆర్కే చనిపోయాడని… ఆయన బుక్ ను ప్రింట్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రింటింగ్ ప్రెస్ లో సీజ్ చేసిన మెటీరియల్ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. తన భర్తపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకుని, వెంటనే ఆయనను విడుదల చేయాలని అన్నారు. ఇది భావస్వేచ్ఛ పై దాడి అని ఆమె మండి పడ్డారు . తాము తమ ప్రింటింగ్ ప్రెస్ అడ్రెస్స్ తోనే బుక్ ప్రింట్ చేస్తున్నామని ఇందులో తాము చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని న్యాయస్థానాల ద్వారానే ఎదుర్కుంటామని అన్నారు.ఆయన ఒక్క ప్రింటింగ్ ప్రెస్ మీదికి 50 మంది పోలీసులు రావడం ఏమిటని అన్నారు ,ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమేనని వెంటనే పోలీసులు తీసుకోని పోయిన పుస్తకాలు ఇతర మెటీరియల్ అప్పగించాలని డిమాండ్ చేశారు.

Related posts

అమెరికాలో గన్ కల్చర్ …పాఠశాలలో విద్యార్థులు మధ్య ఘర్షణ కాల్పులు…

Drukpadam

క‌న్హ‌య్య కుమార్‌పై దాడి.. మురుగునీటి కాల్వలో పడిపోయిన మహిళా జర్నలిస్టు..!

Ram Narayana

గంటన్నరలో 22 పెగ్గుల మద్యం తాగించి వ్యక్తి హత్య!

Drukpadam

Leave a Comment