Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వడ్లు కొనడం చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారు: షర్మిల

వడ్లు కొనడం చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారు: షర్మిల
-రైతులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదు
-రైతుకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
-వడ్లు ఎందుకు కొనడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ 

-రైతులకు అన్యాయం చేస్తే ఎంతటి త్యాగానికైనా సిద్దమే

వడ్లు కొనుగోలుపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య యుద్ధం నడుస్తున్న వేళ ఈ రెండు ప్రభుత్వాలు రైతులకు ద్రోహం చేస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. పాలకులు ప్రజల క్షేమం కోసం పనిచేయాలి గాని కార్పొరేట్ యాజమాన్యాలకు ఊడిగం చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలంగాణాలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిందని రాష్ట్రప్రభుత్వం నిన్న రాష్ట్రవ్యాపితంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళనలు చేసింది. నేడు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై యస్ షర్మిల దీక్ష చేశారు. కేసీఆర్ రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు . మరోపక్క వామపక్షాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాపితంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేశాయి. హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నా నుద్దేశించి షర్మిల కేసీఆర్ విధానాలను తూర్పార పట్టారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రైతులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదని అన్నారు. పంట పండించడం వరకే రైతు పని అని… వారికి మద్దతు ధరను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేసీఆర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈరోజు ఆమె దీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నాయని… టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కొనడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ. 300 ఎక్కువ ఇచ్చి సన్న బియ్యాన్ని కొన్నారని షర్మిల అన్నారు. కనీస మద్దతు ధరను వెంటనే ప్రకటించి కొనకపోతే రైతులను ప్రభుత్వం మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లైస్ ఆడిట్ రిపోర్టును బయటపెట్టాలని… అప్పుడు రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తోందో వెల్లడవుతుందని చెప్పారు.

Related posts

ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Drukpadam

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్!

Drukpadam

దేశంలోనే సంపన్న సీఎం జగన్: చంద్రబాబు!

Drukpadam

Leave a Comment