Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

 వడ్లు కొనకపోతే బీజేపీ ,టీఆర్ యస్ లు రైతు ద్రోహ పార్టీలుగా మిగులుతాయి …ఖమ్మం ధర్నాలో వామపక్ష నేతల హెచ్చరిక !

కార్పోరేట్లకుకట్టబెట్టేందుకే … బీజేపీ, టి.ఆర్.ఎస్. డ్రామాలు: వామపక్షాలు 

ఖమ్మం కలెక్టరేట్ వద్ద వామపక్షాల మహాధర్నా
రైతును బలిచేసే నాటకాలు, వరిధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలి.
వరి వద్దని అంటే లక్షల కోట్లతో కడుతున్న ఈ ప్రాజెక్టులు ఎందుకు
పాలకులపై పెరుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకే కొత్తనాటకాలు
నూతన వ్యవసాయచట్టాలకు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి

కోట్లాది మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే బీజేపీ డ్రామాలాడుతుందని టి.ఆర్.ఎస్. దానికి ఒంతపాడుతుందని వామపక్షాల నేతలు ఆరోపించారు. ధాన్యపు రాసులతో రోడ్లపై రైతులు వేదనకు గురి అవుతుంటే బీజేపీ, టి.ఆర్.ఎస్.లు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను బలిచేసే నాటకాలాడుతున్నారని ఆరోపించారు. రబీలో వరిసాగుకు అనుమతి ఇవ్వాలని ఖరీప్ లో పండించిన పరిధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఐ. సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాచౌక్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నరైతులు బీజేపీ, టి.ఆర్.ఎస్.లకు వ్యతిరేకంగా నినదించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని, రబీలో వరిసాగు చేసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. సి.పి.ఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు పాటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు, సి.పి.ఎం రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, రబీలో వరిసాగుకు అనుమితి విషయంలో బి.జేపీ, టి.ఆర్.ఎస్.లు కొత్తనాటకానికి తెరలేపాయన్నారు. మోడీ, కేసీఆర్ పై పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకే కూడబల్కుని ఆందోళనలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి.ఆర్.ఎస్ ధర్నాలు చేస్తే ధాన్యం ఎవరు కొనాలని వారు ప్రశ్నించారు. భారతదేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని వారు ఆరోపించారు. రైళ్ళు, విమానాలు, రోడ్లు, బి.ఎస్.ఎన్.ఎల్. ఎల్.ఐ.సి. ప్రధానమైన వ్యవస్థలన్నీ కార్పోరేట్ల చేతికి చిక్కిన తరువాత ఇప్పుడు 145 కోట్ల మందికి ఆహార పదార్థాలను అందించి 100 కోట్ల మంది ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ, కేసీఆర్లు కూడబల్కున్నారని హేమంతరావు, సుదర్శన్ లు ఆరోపించారు. కార్పొరేట్లకోసం మోడీ నూత వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే సంవత్సర కాలమైన నోరు మెదపని కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓటమి తరువాత ఎందుకు విమర్శిస్తున్నారని వారు ప్రశ్నించారు. 600 మంది రైతులు సంవత్సరం కాలంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినా స్పందించని కేసీఆర్ కు ఇప్పుడు సాగుచట్టాలు గుర్తుకొచ్చాయా? అని ఎద్దేవా చేశారు. లకింపుర్ లో కేంద్ర మంత్రి కొడుకు రైతులను వాహనాలతో తొక్కించినా నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడు కోవలసిన బాధ్యత. ప్రతి ఒక్కరి పై ఉందన్నారు . వరి వద్దంటే లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. కోటి ఎకరాల మాగాణి అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వరి ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ, కేసీర్ వేరు. కారని ఒకే నాణానికి బొమ్మా, బొర్సులని ధ్వజమెత్తారు . ఇప్పటికైనా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రబీలో _అనుమతివ్వాలని లేని పక్షంలో అందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సి.పి..ఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గసభ్యులు మహ్యద్ మౌలానా, జమ్ముల జితేందర్ రెడ్డి, ఎస్.కె.జానిమియా, బి.జి. క్లెమెంట్, కొండపర్తి గోవిందరావు, పోటు కళావతి, యర్రాబాబు, మహ్మద్ సలాం, సిద్దినేని కర్ణకుమార్, తాటి వెంకటేశ్వరరావు, సి.పి.ఎంనాయకులు పాన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాదినేని రమేష్, మాచర్ల భారతి సి.పి.ఐ, సి.పి.ఎం నాయకులు దొండపాటి రమేస్, పుచ్చకాయల సుధాకర్, మేకల శ్రీనివాసరావు, వై.సాంబశివరెడ్డి, పావులూరి మల్లి ఖార్జన్, ఎస్.కె.సైదా, ఎస్.కె.యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎవడ్రా నీకు మరదలు … వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఘాటు విమర్శలు…

Drukpadam

అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదు: ష‌ర్మిల‌

Drukpadam

జలవివాదం వెనుక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు:సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనం నేని

Drukpadam

Leave a Comment