Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద ఎదురుదెబ్బ 26 మంది మృతి!

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద ఎదురుదెబ్బ 26 మంది మృతి!
గ్యారపట్టి ఎన్ కౌంటర్: నక్సల్స్ వైపు భారీగా ప్రాణనష్టం
గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు
దద్దరిల్లిన గ్యారపట్టి అటవీప్రాంతం
దాడుల్లో పాల్గొన్న మహారాష్ట్ర సీ-60 కమాండో యూనిట్
అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతం రక్తసిక్తమైంది పోలిసుల ఎదురు కాల్పుల్లో 26 మంది మావోలు మరణించారని సమాచారం. మృతుల సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఉదయం భద్రతా బలగాలకు, నక్సల్స్ కు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరణించిన మావోల సంఖ్య 26కి పెరిగింది. కాగా, ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు.

కాగా, ఈ ఎన్ కౌంటర్ లో మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సీ-60 కమాండో యూనిట్ పాల్గొంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ తరహాలోనే మహారాష్ట్రలో నక్సల్స్ పై పోరుకు సీ-60 యూనిట్ ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. గడ్చిరోలి జిల్లాలోని గ్యారపట్టి అటవీప్రాంతం చత్తీస్ గఢ్ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ మావోయిస్టులకు మంచి పట్టు ఉందని భావిస్తారు. భౌగోళికంగా అనుకూలంగా ఉండడంతో సుదీర్ఘకాలంగా నక్సల్ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అయితే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మర్దింటోలా గ్రామం సమీపంలో చత్తీస్ గఢ్ నుంచి గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారన్న పక్కా సమాచారంతో సీ-60 యూనిట్ కూంబింగ్ నిర్వహించింది. పోలీసులను చూసిన నక్సల్స్ కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులివ్వడంతో ఆ ప్రాంతం తుపాకీ మోతలతో దద్దరిల్లిపోయింది. కాగా, నక్సల్స్ వైపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

మావోలు ఛత్తీస్ ఘడ్ నుంచి గర్చిరోలీ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారన్న పక్క సమాచారంతో మాటు వేసిన పోలీసులపై మావోలు కాల్పులు జరిపారని ప్రతిగా పోలీసులు ఎదుకాల్పులు జరిపారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఎన్ కౌంటర్ నేపథ్యంలో చుట్టుపక్కల అటవీప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Related posts

మహిళ వేషంలో వచ్చి మర్డర్ రాజస్థాన్ లో ఘోరం ….

Drukpadam

కర్ణాటకలో గాయని మంగ్లీ కారుపై రాళ్లదాడి…ఎలాంటి దాడి జరగలేదు మంగ్లీ!

Drukpadam

విశాఖలో కూలిన మూడంతస్తుల భవనం.. అన్నాచెల్లెళ్లు సహా ముగ్గురి మృతి!

Drukpadam

Leave a Comment