Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వడ్లు కొనటంలేదని కేంద్రం ఎక్కడ చెప్పలేదు …పొంగులేటి సుధాకర్ రెడ్డి…

వడ్లు కొనటంలేదని కేంద్రం ఎక్కడ చెప్పలేదు …పొంగులేటి సుధాకర్ రెడ్డి
-సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు
-ఉప్పుడు బియ్యం తీసుకోవడం కుదరదు
-మిల్లర్లతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కు
-హుజురాబాద్ లో ఓటమితో సీఎం కు మతి భ్రమించి మాట్లాడుతున్నారు

కేంద్రం తెలంగాణాలో వడ్లను కొనమని ఎప్పుడు చెప్పలేదని హుజురాబాద్ ఓటమితో సీఎం కేసీఆర్ మతిభ్రమించి బీజేపీ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బిజెపి జాతీయ నాయకులూ , తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు . శనివారం ఖమ్మం లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం వడ్లు కొనటంలేదని ఒక్క మాట కూడా ఎక్కడా చెప్పలేదని , ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత రహితంగా అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు . ఎఫ్ సీ ఐ ద్వారా ముడి బియ్యం & పోషకాలు తో కూడిన బియ్యాన్ని సేకరిస్తామని తెలంగాణా లో మిల్లర్లు వారి టెక్నాలజీని పెంచుకొనేలా చూడాలని కేంద్రం ఇందుకు సహకరిస్తుంది అని అన్నారు . ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మిల్లర్ల తో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కు అయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఖరీఫ్ లో ఉప్పుడు బియ్యం సమస్య లేదు కదా ఎందుకు కొనుగోలు లో జాప్యం చేస్తున్నారు . మీ జాప్యం కారణంగా కామారెడ్డి జిల్లాలో ఒక రైతు గుండెపోటుతో కళ్ళం లోనే చని పోయాడని విమర్శించారు , వరి కేవలం తెలంగాణ లోనే పండుతుందా ?, ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు , కర్ణాటక , ఛత్తీస్ గఢ్ , పశ్చిమ బెంగాళ్, ఉత్తరప్రదేశ్ , పంజాబ్ లలో కూడా పండుతుంది . కానీ ఆరాష్ట్రాల్లో లేని సమస్య కేసిఆర్ కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు . బిజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ…. నిన్న ధర్నా చౌక్ లో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులపై చేసిన వాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర మంత్రిగా ఉండి బీజేపీ నాయకులని తరిమి కొట్టండి అంటూ చిల్లరగా మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు . రాష్ట్ర మంత్రిగా ఉండి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి జైలు కి పంపండని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు . తప్పుడు జి.ఓ లు తీసుకొచ్చి భూమిని రైగులైజ్ చేసుకున్నందుకు రాష్ట్ర మంత్రి జైలుకి పోక తప్పదన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ , శ్రీమతి ఉప్పల శారదా , గెంటేల విద్యాసాగర్ , శ్యామ్ సుందర్ నాయక్ , రుద్రా ప్రదీప్ , మంద సరస్వతి , చావా కిరణ్ , బోయినపల్లి చంద్రశేఖర్ , దుద్దుకూరి కార్తీక్ , అనంతు ఉపేందర్ గౌడ్ , అన్వార్ ఖాన్ , రవిరాథోడ్ , బోడిపూడి రాజా, విక్రమ్ జాదవ్ , లక్ష్మినారాయణ గుప్తా , పిల్లలమర్రి వెంకట్ , ప్రీతం , డికొంది శ్యామ్ సుందర్ , ఎల్లారావు గాడ్ , మురళి కృష్ణ , రుద్రగాని మాధవ్ , ఎం డి ఫజల్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

టికెట్ ఆశించి భంగపడిన బీఎస్పీ నేత.. బోరున ఏడ్చిన వైనం !

Drukpadam

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై సి-130 రవాణా విమానంలో ల్యాండైన ప్రధాని మోదీ!

Drukpadam

సూరులో పాము దూరిందని ఇల్లు తగల బెట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు …

Drukpadam

Leave a Comment