Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం!

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం!
స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డి
సీఎస్ సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖ అందజేత
టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు సమాచారం

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో వెంకట్రామిరెడ్డి చేరబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా ఆయనకు పేరుంది. గతంలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ కు ఆయన పాదాభివందనం చేశారు. చర్యపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి అయి ఉంది ఇలాంటి పని ఎలా చేస్తారని పలువురు విమర్శించారు. ఎప్పటినుంచో ఆయన కు రాజకీయాలకు ఆశక్తి ఉన్నట్లు చెబుతుంటారు . కలక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.

వెంకట్రాంరెడ్డి ని స్థానికసంస్థలనుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేయించి కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేల కోటానుంచి ఎమ్మెల్సీగా ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీలుగా మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి . తక్కెళ్లపల్లి రవీందర్ రావు లకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఆర్ యస్ ప్రకటించింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఈసారి మంత్రి వర్గంలో స్తానం కల్పిస్తారని తెలుస్తుంది. కడియం శ్రీహరి కూడా మంత్రి వర్గంలో చేరే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా అవకాశం

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన లో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం.

Related posts

భద్రాచలం ముంపు పాపం బీజేపీదే: మంత్రి అజయ్..మంత్రి అజయ్ !

Drukpadam

కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Drukpadam

టీఆర్ఎస్ అవినీతిపై పోరు కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment