Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పాలన అద్భుతం …టీఆర్ యస్ లో చేరతా ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి!

కేసీఆర్ పాలన అద్భుతం …టీఆర్ యస్ లో చేరతా ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి!
-టీఆర్ యస్ లో చేరబోతున్నట్లు వెల్లడించిన వెంకట్రామిరెడ్డి
-తెలంగాణ అభ్యున్నతి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు
-దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా తీర్చిదిద్దుతున్నారు
-కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తా

కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ….దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఆయన మార్గానిదేశంలో పనిచేసేందుకు ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాను అని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు. అనేకమంది వద్ద పని చేశాను కేసీఆర్ విజన్ నచ్చింది. ఆయన వెంట నడిచేందుకు తన ఉద్యోగాన్ని వాదులు కున్నానని చెప్పారు. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిన వెంటనే టీఆర్ యస్ లో చేరతానని అన్నారు .

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను సీఎం సోమేశ్ కుమార్ కు పంపించారు. వెనువెంటనే ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలలో పని చేశానని చెప్పారు.

రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని వెంకట్రామిరెడ్డి కొనియాడారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. రానున్న వందేళ్లు తెలంగాణ గురించి చెప్పుకునేలా కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కితాబునిచ్చారు. ఈ అభివృద్ధి పయనంలో కేసీఆర్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తానని తెలిపారు. మరోవైపు వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ కు ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.

Related posts

అవినీతికి వ్యతిరేకంగానే మా పోరాటం: కర్ణాటక సీఎం బొమ్మై!

Drukpadam

తుళ్లూరు బ్రహ్మయ్య పై దాడిలో మరోకోణం…!

Drukpadam

కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు!

Drukpadam

Leave a Comment