Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్లదాడి …

బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్లదాడి …
ఇది టీఆర్ యస్ కార్యకర్తలపైనే అంటున్న బీజేపీ
పిరికిపందల చర్యగా కొట్టి పారేసిన సంజయ్
రెచ్చగొట్టేందుకే బండి సంజయ్ పర్యటనలు చేస్తున్నారని పల్లా
బీజేపీ తప్పుడు ప్రచారాలు కట్టి పెట్టాలన్న రాజేశ్వర్ రెడ్డి
ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి పర్మిషన్ లెటర్ తేవాలని డిమాండ్

బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ళూ ,కోడిగుడ్లతో దాడి జరిగింది. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు నల్గొండ జిల్లాలోని పలు ఐ కె పి కేంద్రాలను సందర్శించేందుకు వెళ్లారు . ఈ సందర్భంగా టీఆర్ యస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పి నందున పర్యటన చేసే అర్హత బండి సంజయ్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ,టీఆర్ యస్ కార్యకర్తల నడమ నినాదాలు ,ప్రతినినాదాలు చోటు చేసుకున్నాయి. కొందరు సంజయ కాన్వాయ్ పై రాళ్ళూ రువ్వారు . ఐదుపాకశాలను శాంతింప చేసేందుకు పోలీసులు హైరానా పడ్డారు. అది సర్దు మణిగి తిరిగి పర్యటనలో ఉండగా చిల్లపల్లి వద్ద ఆయన పై దాడికి టీఆర్ యస్ కార్యకర్తలు ప్రయత్నించారని బీజేపీ ఆరోపిస్తుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు శ్రమించాల్సివచ్చింది.

దీనిపై బీజేపీ సీరియస్ గా స్పందించింది. బండి సంజయ పై దాడి కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నది. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అందువల్లనే ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులకు స్వస్తి పలకకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించింది. ఇది పిరికిపందల చర్యగా బండి సంజయ్ అన్నారు. వాస్తవాలు దాచి బీజేపీ ఎదుగుదల చూసి ఫ్రస్టేషన్ లో ఉన్న కేసీఆర్ చివరకు భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నారని మండి పడ్డారు.

టీఆర్ యస్ రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

Related posts

సిద్ధరామయ్య కేబినెట్లోకి 24 మంది కొత్త మంత్రులు.. ఎవరెవరు, ఏయే సామాజికవర్గాలకు చెందినవారంటే..?

Drukpadam

వైసీపీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే పై వేటు …

Drukpadam

టీడీపీలో ప్రక్షాళన జరగాలి…. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని!

Drukpadam

Leave a Comment