Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు ఏపీలోనే అత్యధికం: చంద్రబాబు

పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు ఏపీలోనే అత్యధికం: చంద్రబాబు
అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ అధినేత
నిత్యావసరాల ధరలతో జనం ఉక్కిరిబిక్కిరి
చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వమంటూ మండిపాటు

జగన్ ప్రభుత్వంపై టీడీపీ మరోసారి ధ్వజమెత్తింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కరంట్ చార్జీలు పెరిగాయని , పెట్రోలు ,డీజిల్ ,గ్యాస్ ధరలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమావేశాలకు టీడీపీ సభ్యులతో కలిసి చంద్రబాబు కాలినడకన అసెంబ్లీ వెళ్లారు . జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో.. పార్టీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. పెరిగిన ధరలపట్ల ప్రభుత్వంపై నిరసన తెలిపారు. బ్యానర్ పట్టుకుని వెళ్లారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి.. జీవన ప్రమాణాలు పడిపోయే స్థితికి వచ్చిందని విమర్శించారు. పెరిగిన పన్నుల భారం, ధరాభారంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ల నియామకం పై తెలుగు దేశం : ముగ్గురిపై క్రిమినల్ కేసులన్న వర్ల…

Drukpadam

జనసేన బాటలో టీడీపీ …బద్వేల్ ఎన్నిక ఏకగ్రీవమేనా …?

Drukpadam

అమెరికా కు తగ్గేదే లేదంటున్న ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ !

Drukpadam

Leave a Comment