వికేద్రీకరణ పై ఏపీ వ్యూహాత్మక అడుగులు …పూర్తిసమగ్రమైన మెరుగైన బిల్లు తెస్తాం :సీఎం జగన్
విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే మూడు రాజధానుల బిల్లు ను ఉపసంహరణ
కొందరికి న్యాయం కాదు …అందరికి న్యాయం చేస్తాం
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం
అమరావతి ప్రాంతంలో కనీస సదుపాయాలు లేవు …
గతంలో కర్నూల్ లో రాజధాని , గుంటూరు లో హైకోర్టు ఉంది.
శ్రీబాగ్ ఒప్పందం స్పూర్తితో ముందుకు పోతాం
2019 ఎన్నికల్లో ప్రజల తీర్పు వికేద్రీకరణకు అనుకూలంగా ఉంది.
బిల్లుకు మరిన్ని మెరుగులు …న్యాయపరమైన చిక్కులు లేకుండా చేస్తాం
ఏపీ లో మూడు రాజధానులకోసం తెచ్చిన వికేద్రీకరణ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అత్యవసర కాబినెట్ సమావేశం అనంతరం ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు సీఎం స్వయంగా ఈ ప్రకటన చేశారు. బిల్లు ఉపసంహరణ విషయం హైకోర్టు లో అడ్వకేట్ జనరల్ వాదనల సందర్భంగా తెలపగా ఏపీలో ఈ విషయసంచలనంగా మారింది.టీవీ లలో వరస డిబేట్లు , వార్తలు వ్యాఖ్యానాలు పరంపరగా కొనసాగాయి. కొద్దీ సేపటికే ప్రభుత్వం తన వైఖరిని శాసనసభలో స్పష్టం చేయడంతో అమ్మ జగన్ దీని వెనకాల ఇంత కథ ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అంశంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని అందువల్ల ప్రజలని ఒప్పించి ,మెప్పించి తిరిగి బిల్లులకు మెరుగైన రీతిలో సమగ్రంగా ,న్యాయపరమైన అన్ని అడ్డంకులను తొలగించుకొని తెస్తామని సీఎం ప్రకటించారు. ప్రజల విస్తృత ,విశాల ప్రయోజనాల దృష్ట్యానే ప్రస్తుతం బిల్లును ఉపసంహరించుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంతకుముందు లెక్క కాకుండా అన్ని కోణాలనుంచి పరిశీలనా చేసి సమగ్రమైన రూపంతో బిల్లు తెస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఁధ్రప్రదేశ్ ఏర్పాటు , కర్నూల్ రాజధాని , గుంటూరు లో హైకోర్టు ఏర్పాటు చేసిన విషయాన్నీ సీఎం ప్రస్తావించారు. శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని ఉద్ఘాటించారు.
కొందరికి న్యాయం కాదు …అందరికి న్యాయం చేస్తాం …
సీఎం జగన్ మూడు రాజధానులు డీఆర్డీఏ బిల్లుల ఉపసంహరణ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పాలకులు చేసిన తప్పులు తిరిగి జరగకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయడమే తమ ఎజెండా అని అన్నారు. కొందరికి న్యాయం కాదు …అందరికి న్యాయం అనేది మావిధానమని స్పష్టం చేశారు.
అమరావతికి నేను వ్యతిరేకిని కాదు …నా ఇల్లు ఇక్కడే ఉంది.
నేడు అమరావతికి వ్యతిరేకిని కాదు …నా ఇల్లు ఇక్కడే ఉంది. .. అయితే అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి అందుకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి . నా ఇల్లు ఇక్కడే ఉందని దాని చుట్టూ అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే గతంలో ఏమి జరిగిందో అదే పునరావృతం అవుతుందని అన్నారు.
అమరావతిలో కనీస సౌకర్యాలు లేవు …
అమరావతి రాజధాని అంటున్నాం … మంచిదే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ..అక్కడ నిర్మాణం జరగాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ ఇక్కడి ప్రజలను కూడా ఒప్పించి న్యాయపరమైన ఎలాంటి చిక్కులు లేకుండా మరిన్ని జాగ్రత్తలతో బిల్లు తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో ప్రజలు వికేద్రీకరణకు అనుకూలంగా తీర్పు నిచ్చారు.
ప్రజలు 2019 ఎన్నికల్లో వికేద్రీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు. తరువాత జరిగిన అనేక ఎన్నికల్లో అది నిరూపితమైంది. అందువల్ల ప్రజాభీష్టానికి అనుకూలంగా పాలనా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.