Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి …ఖమ్మం లో అన్ని కమ్మలకేనా!

మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి …ఖమ్మం లో అన్ని కమ్మలకేనా
-పదవులకు బీసీ లు పనికి రారా ?
-ఖమ్మం ఎమ్మెల్యే , ఎంపీ , ఎమ్మెల్సీ కమ్మ సామాజికవర్గానికి
-మార్కెట్ కమిటీల్లో కూడా వారికే అవకాశం… ఇదెక్కడి న్యాయం
-మున్నూరు కాపులకు న్యాయం జరగలేదని తీవ్ర అసంతృప్తి
-ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల టికెట్ ఆశించిన మున్నూరు కాపులు
-గాయత్రీ రవి , లేదా ఆర్జేసీ కు టికెట్ వస్తుందనుకున్నా దక్కని వైనం

ఖమ్మం జిల్లా మున్నూరు కాపుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది . బీసీ కులాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న తమకు అధికార టీఆర్ యస్ పార్టీలో తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంలేదని అభిప్రాయం బలంగా ఉంది. ఖమ్మం జిల్లా విడిపోయిన తరువాత ఇంతవరకు ఏ పోస్ట్ దక్కలేదని ఇచ్చినా అరకొరగా ఇచ్చి తమను పట్టించుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని మున్నూరు కాపులలో గాయత్రీ రవి లేదా ఆర్జేసీ కృష్ణ కు ఇస్తారనుకుంటే ఇవ్వకపోవడం దారుణమని మున్నూరు కాపు నేతలు కొత్త సీతారాములు ,శెట్టి రంగారావు , ఆకుల గాంధీ , తదితరులు ధ్వజమెత్తారు .

ఖమ్మం జిల్లాలో మిగతా సామాజికవర్గాలు పదవుల పంపకంలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులకు బీసీలు పనికి రారా ? అన్ని కమ్మలకేనా ? అంటూ మున్నూరు కాపు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు . ఖమ్మం లో ఎమ్మెల్యే , ఎంపీ, ఎమ్మెల్సీ లు అందరు ఒకే సామాజికవర్గానికి ఇస్తే మిగతావారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా లో విషయంలో జరుగుతున్న అన్యాయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో మున్నూరు కాపులు ఆరుగురు ఎమ్మెల్సీలు గా ఉండి రిటైర్ కాగా కేవలం ఇద్దరు ,ముగ్గురికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉండి టీఆర్ యస్ కు ఓటు బ్యాంకు గా ఉన్న మున్నారు కాపులకు కచ్చితంగా టిక్కెట్లు వస్తాయనుకుంటే రాలేదని, ఇది తమ సామాజికవర్గంపట్ల చిన్న చూపు చూడటమేనని వారు అన్నారు . కేసిఆర్ వైఖరి తో రాష్ట్రంలో లోని మున్నూరు కాపులకు తీవ్ర మనోవేదనకు గురైయ్యారని పేర్కొన్నారు . ఈ రకమైన వైకిరి అవలంబిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు తామసత్తా చాటడం ఖాయమన్నారు .

కేసిఆర్ ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపులకు మార్కేట్ చైర్మన్ పదవులు కానీ, జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి కానీ, డిసి యమ్ స్ చైర్మన్ పదవి కానీ, ఖమ్మం నగర మేయర్ పదవి గాని, మున్సిపల్ చైర్మన్ గాని ఇవ్వకపోవడంతో, కేసిఆర్ తన గోయి తానే తోడు కుటుంన్నాడని తీవ్రంగా మండి పడ్డారు.

 

Related posts

అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న దుష్ట రాజకీయ శక్తులు: ఏపీ సీఎం జగన్!

Drukpadam

పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

గుజరాత్ లో ఆప్ కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన సూరత్ కౌన్సిలర్లు!

Drukpadam

Leave a Comment