Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంత్రి కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

-అసెంబ్లీలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
-సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు
-నానికి అదనంగా 1+4 భద్రత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది . టీడీపీ ,వైసీపీ పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భౌతిక దాడులకు కూడా వెనకాడటంలేదు . కొంతకాలం క్రితం టీడీపీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిచేశారు. నాటినుంచి కొనసాగుతున్న వైరం కొనసాగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి వైసీపీ వ్యాఖ్యలు చేసిందని చంద్రబాబు, వైసీపీ పై టీడీపీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని పలువురు ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు .చంద్రబాబు తాను తిరిగి ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీ లో అడుగు పెట్టనని భీష్మ ప్రతిజ్ఞ చేసి సభనుంచి టీడీపీ సభ్యులతో వాక్ అవుట్ చేసి వెళ్లారు . చంద్రబాబు పై మంత్రి కోడలి నాని , అంబటి రాంబాబు , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలు దృష్ట్యా వారికీ ప్రత్యేక భద్రత కల్పించారు .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కొడాలి నానితోపాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది.

మంత్రి నానికి ఇప్పటికే 2 ప్లస్ 2 భద్రత ఉండగా అదనంగా 1 ప్లస్ 4 భద్రత కల్పించింది. అలాగే, ఆయన కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కేటాయించారు. ఎమ్మెల్యేలకు అదనంగా 3 3 గన్‌మన్లతో భద్రత కల్పించారు.

Related posts

టీటీడీ ‘ప్రత్యేక ఆహ్వానితులకు’ హైకోర్ట్ బ్రేక్

Drukpadam

అమ్మా… మిమ్మల్ని మేం ఏమీ అనలేదమ్మా: నారా భువనేశ్వరికి అంబటి రాంబాబు వివరణ

Drukpadam

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

Leave a Comment