కమ్యూనిస్టులు బలహీనపడితే ప్రజలకు నష్టం అనే భావన ప్రజల్లో పెరిగింది…నున్నా
కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రాణం పోయాలి
ప్రజా పోరాటాలు, ఉద్యమాలలో ముందు పీఠిన నిలవాలి
ప్రజా సమస్యలపై పోరాటాలే సిపిఎం మహాసభల ఎజెండా
– విలేఖర్ల సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
కమ్యూనిస్టులు బలహీనపడితే ప్రజలకు ,ప్రజా ఉద్యమాలకు నష్టం అనే భావన ప్రజల్లో కలిగిందని ఇది భవిషత్ ప్రజాఉద్యమాలకు మంచి సంకేతమని ప్రజల్లో ఉన్న భావనను నిజం చేయాలంటే సిపిఎం పోరాటాలను బలపరచాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు పిలుపు నిచ్చారు. ఈనెల 29 ,30 తేదీలలో జరగనున్న సిపిఎం ఖమ్మం జిల్లా మహాసభల్లో సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . సభల్లో ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిషత్ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రాణం పోసేందుకు ఖమ్మం సభలు వేదిక అవుతాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్ట్ ల కంచుకోటగా ఉందని అనేక కారణాల రీత్యా కమ్యూనిస్టులు బలహీన పడ్డ మాట నిజమేనని అయితే దాన్ని అధిగమించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు పోతామన్నారు. ప్రజలకు అండగా , ప్రజాఉద్యమాలకు దిక్ సుచిగా మహాసభల్లో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.
ఇటీవల కాలంలో ఎన్నికల్లో ప్రలోభాల ,ఆర్థిక జోక్యాలతో కొంత పార్టీ ప్రతినిధులు ఎన్నిక కాలేక పోతున్నారని అన్నారు. అసెంబ్లీలో గానీ, జిల్లా పరిషత్లలో గానీ, పార్టీ ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడం వలననే పాలకపార్టీలు ఇష్టారాజ్యంగా ప్రజలపై భారాలు మోపుతూ పరిపాలన సాగిస్తున్నాయని ప్రజలు చర్చిస్తున్నారన్నారు. కావున భవిష్యత్ ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు తిరిగి ఖమ్మం నుండే ప్రాణం పోయనున్నట్లు తెలిపారు .
గత 2 ఏండ్లుగా కోవిద్ ప్రజా జీవనం కలమైన సందర్భంలో కోవిడ్ మొదటి విడతలో సిపిఎం ప్రజలకు అండగా నిలబడి 880 కేంద్రాలలో 1 కోటి 60 లక్షల రూపాయల వివిధ వస్తు, ఆర్థిక సహకారాలు అందించిందన్నారు. రెండవ దఫాలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి జిల్లాలో 230 మందిని బ్రతికించి ఇంటికి పంపామన్నారు. ప్రతిరోజూ 50 మంది వాలంటీర్లు 500 నుండి 600 భోజనాలు జిల్లా కేంద్రంలో, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అదే విధంగా మండలాలలో అల్పాహారాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తంగా 250 కోట్ల రూపాయలు అన్ని రూపాలలో సహాయ సహకారాలు జిల్లా ప్రజలకు సిపిఎం పార్టీ అందించిందన్నారు.
జిల్లాలో సిపిఎం ఆధ్వరంలో జరిగిన ఆందోళనలు గురించి ఆయన వివరించారు. అదే విధంగా సిపిఎం నాయకులూ కార్యకర్తలపై పాలక పార్టీలు మోపుతున్న తప్పుడు కేసులపై స్పందించామన్నారు. మా గమ్యం సోషలిజం ఆదిశగా ఎర్రజెండా నీడలో పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు .ప్రజలు ,ప్రజాస్వామ్య వాదులు , తమపోరాటాలకు అండదండలు ఇవ్వాలని నున్నా విజ్ఞప్తి చేశారు.
విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గం భూక్యా వీరభద్రం పాల్గొన్నారు.