Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పీఆర్సీ బకాయిలు ఒకేసారి చెల్లించాలి :పెన్షనర్ల డిమాండ్

పీఆర్సీ బకాయిలు ఒకేసారి చెల్లించాలి :పెన్షనర్ల డిమాండ్
-జీవో నెంబరు 1406ను సవరించాలి
-విశ్రాంతి ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ర్యాలీ
-జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ….

పీఆర్సీ బకాయిలను వాయిదాల పద్దతిలో కాకుండా ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల సంఘం ఆధ్వరంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వించారు. జనవరి నుంచి 36 వాయిదాలలో అంటే 3 సంత్సరాల కాలం వరకు చెల్లిస్తామని చెప్పడం అత్యంత అన్యాయమని ఉపాధ్యా ,ఉద్యోగ సంఘాల పెన్షనర్లు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1406ను వెంటనే సవరించాలని అన్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వరంలో రికాబ్బజార్ హైస్కూల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు . చైతన్య వేదిక కో – కన్వీనర్ రాకల శ్యామ్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి చైతన్య వేదిక కన్వీనర్ తాళ్ళురి వేణు పాల్గొని మాట్లాడారు విశ్రాంతి ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ మానవ కోణాన్ని మర్చిపోయి ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు . ఒకే దఫాలో ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలను 36 నెలల వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ఏకపక్షంగా జీవో నెంబర్ 1406 ను జారీ చేయడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు . అనేక ఆర్థిక సమస్యలను , ఇబ్బందులను ఎదుర్కొంటున్న విశ్రాంతి ఉద్యోగుల పట్ల మొండి వైఖరితో ఉండటాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు . ఒక్క విశ్రాంతి ఉద్యోగ కుటుంబం ఇబ్బందులు పాలైతే ఆ కుటుంబంలోని సభ్యులంతా ప్రభుత్వ వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉంటారని దాని ఫలితం వచ్చే ఎన్నికల్లో పాలకులు చూడవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు . 1406ను సవరించాలి , పెండింగ్లో ఉన్న 4డిఎలను వెంటనే విడుదల చేయాలి , ఒకటో తేదీకల్లా పెన్షన్లు ఇవ్వాలని , ఈ కుబేర్ పేర నెలల తరబడి ఉన్న బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ కుబేర్ విధానాన్ని మార్చాలని , పీఆర్సీ బకాయిలను ముప్పై ఆరు నెలల్లో కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో రికా బజార్ హైస్కూల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శనను చేపట్టారు . అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగ ఉపాధ్యాయుల , ఐక్యవేదిక నాయకులు రాములు , వెంకటనారాయణ , యలమూడీ రవీందర్ , సిహెచ్ రాంబాబు , యూ వెంకటేశ్వర్లు , చెల్లి బాబురావు , తాళ్ళురి శేషగిరి , చంద్ర పాణి , బిచ్చ నాయక్ కొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు మరో ఐదు రోజులు పొడిగింపు..!

Drukpadam

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం…

Drukpadam

కొండెక్కిన కోడి మాంసం…

Drukpadam

Leave a Comment