Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం లో పోలీస్ ,డాక్టర్స్ మధ్య క్రికెట్ మ్యాచ్…దుమ్మురేపిన పోలీస్ జట్టు!

ఖమ్మం లో పోలీస్ ,డాక్టర్స్ మధ్య క్రికెట్ మ్యాచ్…దుమ్మురేపిన పోలీస్ జట్టు!
-ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
-డాక్టర్స్ ,పోలిసుల మధ్య సమన్వయానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకం సిపి
-పనివత్తిడి తగ్గించటానికి ఆటవిడుపుగా ,ఆటలు

ఖమ్మం జిల్లా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్ , పోలీస్ టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా సాగింది. ఆదివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ శిక్షణ కేంద్ర మైదానంల ఐ ఎం ఎ డాక్టర్స్ మరియు పోలీస్ వారియర్ టీమ్ రెండు పోలీస్ టీమ్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లోని విజేతలకు
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ట్రోఫీలు అందజేశారు. పోలీస్ కమిషనర్ తో పాటు ఆర్ బి ఐ మేనేజర్ అనురాగ్ రాయ్ పాల్గొన్నారు.

టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 151 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డాక్టర్ వారియర్ జట్టు 10.1 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేయడంతో పోలీస్ జట్టు విజయం సాధించింది.
ఇరు జట్లు పోటా పోటీగా తలపడటంతో మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది. అనంతరం విజేతలకు పోలీస్ కమిషనర్ మరియు అటగాళ్లకు ట్రోఫీలు అందించారు.

ఈ క్రికెట్ మైదానం నలుమూలలా కళాత్మక షాట్లతో అలరించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పోలీస్ జట్టు నుంచి శ్రీధర్ (స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ) నిలిచారు. బెస్ట్ బ్యాటింగ్ డాక్టర్ రాఘవేంద్ర గా ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. నిత్యం పని వత్తిడిలో ఉండే డాక్టర్లు, పోలీసులు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు. పోలీసు, వైద్యుల మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామని, ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ ఎల్ సి నాయక్, ఎసిపి లు భస్వారెడ్డి, ప్రసన్న కుమార్ ,వినయబాబు, ఐఎంఎ సెక్రటరీ సురేష్ పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Related posts

అద్దాల వంతెన ఎంతపని చేసింది

Drukpadam

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై కేసు…

Ram Narayana

దేశ జనాభాతో సమ నిష్పత్తిలో పెరుగుతున్న ముస్లిం జనాభా…!

Drukpadam

Leave a Comment