Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట విద్యార్థి మృతి, కోమాలోకి నల్గొండ యువతి!

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట విద్యార్థి మృతి, కోమాలోకి నల్గొండ యువతి!
-11 నెలల క్రితం అమెరికాకు
-శనివారం షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
-వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన టిప్పర్

అమెరికా లో జరిగిన రోడ్ ప్రమాదంలో సూర్యాపేట కు చెందిన యుకుడు మృతి చెందగా ఆయన తో పటు కార్ లో ఉన్న యువత గాయాలతో షాక్ గురై కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. కొద్దినెలల క్రితమే ఉన్నత చదువులకోసం వారు అమెరికా కు వెళ్లారు . అక్కడ చదువు కుంటూ జాలిగా కాలం గడుపుతున్న వేళ విధి వక్రీకరించింది.వారు ప్రయాణిస్తున్న కార్ కు టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యు శకటం ఢీకొనడంతో చిరుసాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు . ఈ విషయం తెలుసుకున్న సాయి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది. . సూర్యాపేటలోని నల్లాల బావి ప్రాంతానికి చెందిన చిరుసాయి (22) ఉన్నత విద్య అభ్యసించేందుకు 11 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. శనివారం షాపింగ్‌కు వెళ్లిన సాయి సాయంత్రం కారులో ఇంటికి బయలుదేరాడు.

ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన ఓ టిప్పర్ అతడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, నల్గొండకు చెందిన యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

Related posts

కర్ణాటకలో కలకలం …ఎమ్మెల్యేను హత్య చేస్తే కోటి…

Drukpadam

హైదరాబాద్‌ లో దారుణం.. ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం!

Drukpadam

హైదరాబాద్‌లో భారీ చోరీ..నగదు జోలికి వెళ్లని దొంగలు!

Drukpadam

Leave a Comment