Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ప్రస్తావన ఎక్కడా రాలేదు: తమ్మినేని సీతారాం!

అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ప్రస్తావన ఎక్కడా రాలేదు: తమ్మినేని సీతారాం!
-సభలో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకురావడం సరికాదు
-ఆయన అలా ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి
-మైక్ ఇవ్వలేదని చంద్రబాబు అనడం దురదృష్టకరం

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో తనభార్యను గురించి వైసీపీ సభ్యులు మాట్లాడారని సభ నుంచి వాకౌట్ చేసి తిరిగి తాను సీఎంగా మాత్రమే సభలో అడుగు పెడతానని శపథం చేసి మరి వచ్చారు. తరువాత మీడియా తో మాట్లాడుతూ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన భార్యపేరు అనవసరంగా వైసీపీ సభ్యులు సభలో తెచ్చారని భోరున విలపించారు. ఇది దేశవ్యాపితంగా పెద్ద చర్చనీయాంశం అయింది.

చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయనాయకుడిని అంతమాట అన్నారా? వైసీపీ మూర్ఖులు అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. టీడీపీ శ్రేణులు వైసీపీ సభ్యుల చర్యలకు నిరసనగా ధర్నాలు చేశారు . అనేక మంది ప్రముఖులు , వివిధ పార్టీలకు చెందిన వారు సెలబ్రిటీలు చంద్రబాబుకు ఫోన్లు చేసి సంఘీభావం ప్రకటించారు.

దీనిపై సభలో ఏమి జరిగింది. అసలు చంద్రబాబు భార్యపేరు ఎవరు తీసుకొచ్చారు.నిజంగా తీసుకొచ్చారా? లేదా అనేదానితో సంబంధం లేకుండా సంఘీభావం ప్రకటించడం ఆశ్చర్యకరమే ? నిజంగా చంద్రబాబు భార్యను వైసీపీ సభ్యులు అంటే వారు శిక్షార్హులే . ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ వాస్తవాలు ఏమిటి అనేది తెలియకుండా కేవలం రాజకీయాలకోసం నిందలు వేసుకోవడం ,వేయడం క్షంతవ్యం కాదు . దీనిపై శాసనసభ స్పీకర్ ఏమంటున్నారు అంటే ….

శాసనసభ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన ఎక్కడా రాలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కానీ చంద్రబాబు అలా ఎందుకు చేశారో ఆయనకు మాత్రమే తెలియాలని చెప్పారు. సభలో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకురావడం సరికాదని అన్నారు. సభలో మాట్లాడేందుకు తాను అందరికీ సమాన అవకాశాలను ఇస్తున్నానని చెప్పారు. తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడం దురదృష్టకరమని అన్నారు.

తన భార్య ప్రస్తావనను వైసీపీ సభ్యులు తీసుకొచ్చారంటూ చంద్రబాబు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. టీడీపీ శ్రేణులు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే తమ్మినేని పైవ్యాఖ్యలు చేశారు. తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts

100 రూపాయల నోట్ పై ఎన్టీఆర్ ఫోటో పెట్టె ప్రతిపాదన ఏది లేదు …ఆర్బీఐ స్పష్టికరణ !

Drukpadam

కాంగ్రెస్ పై టీఆర్ యస్ ఎదురుదాడి

Drukpadam

స్త్రీపురుషులు దీర్ఘకాలం కలిసుంటే పెళ్లయినట్టే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment