Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది… మోడీ, కేసీఆర్ ల పతనం ప్రారంభమైంది: తమ్మినేని!

ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది… మోడీ, కేసీఆర్ ల పతనం ప్రారంభమైంది: తమ్మినేని!
– టీఆర్ఎస్ వైఫల్యాలే బీజేపీకి ఊతం..
– పాలకులు గుడ్డిగా ఏ చట్టాలు చేయొద్దు
– కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాల రద్దు
-సాగుచట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడుదాం..
-అననుకూల పరిస్థితుల్లో నిలబడేవాడో కమ్యూనిస్టు
– సీపీఐ(ఎం) ఖమ్మల జిల్లా 21వ మహాసభల్లో -పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు మొదలైంది.. మోడీ, కేసీఆర్ పతనం ప్రారంభమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాలు రద్దయ్యాయని తెలిపారు. పాలకులు గుడ్డిగా చట్టాలు చేయడం వల్లనే 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పో యారన్నారు. సాగు చట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక ఎంబీ గార్డెన్స్లోని వేదగిరి శ్రీనివాసరావునగర్ లో సోమవారం ప్రారంభమైన. పార్టీ ఖమ్మం జిల్లా 23వ మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో మతోన్మాడం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన గుడ్డి చట్టాల ఫలితంగా 750 మంది రైతులు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలు నిర్వహించి ప్రాణాలు కోల్పోయారన్నారు. పంజాబ్, హర్యానా , ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతాంగం పట్టుదలతో ఉద్యమించి నల్లచట్టాలను తిప్పికొట్టారన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక ఐక్యతతోనే రైతాంగ ఉద్యమం సఫలీకృతమైందని తెలిపారు. తాను తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని ప్రధాని మోడీ క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వాలు గుడ్డిగా చట్టాలు చేయుద్దన్నారు. నగరీకరణ పథకంలో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం. లీజుకివ్వడం వంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. దీనిలో భాగంగానే ఎయిరిండియాను రూ.1,750 కోట్లకు అమ్మిందన్నారు. 2022 నాటికి కొత్త భారతదేశం చూస్తారన్న మోదీ 2019 ఆగష్టు 6న ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్తో పాటు దేశ ప్రజల హక్కులను హరించివేయాలని ప్రయత్నించారన్నారు. డిసెంబర్లో మతప్రాతిపదికన సీఎఏ పట్టం తీసుకొచ్చారన్నారు. 2021 ఆగష్టు 5న రామజన్మభూమికి శంకుస్థాపన చేశారన్నారు. ఇలా దేశ ప్రజల హక్కులను హరించే చట్టాలను ఒకదాని వెంట ఒకటి తీసుకొచ్చారన్నారు. బీజేపీకి పుట్టగతులుండవనే ఉద్దేశంతోనే సాగు చట్టాలను రద్దు చేశారన్నారు. ఇలాంటి గుడ్డి చట్టాల వల్లనే ఒకనాటి ప్రభావాన్ని మోడీ కోల్పోయారన్నారు.బీజేపీ అసలు స్వరూపం ప్రజలు తెలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు.

టీఆర్ఎస్ పైనా వ్యతిరేకత మొదలైంది..

రాష్ట్రంలోనూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ యస్ పై వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 1.91 లక్షలు మాత్రమే వెకెన్సీ ఉన్నాయన్న సీఎం కేసీఆర్ దానిలో కేవలం 32వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ మొత్తం నీళ్లిచ్చినట్లు సీఎం చెప్పుకుంటున్నారని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నీళ్లిచ్చే సీతారామ, ఉమ్మడి నల్లగొండకు నీరిచ్చే ఎలిమినేటి మాధవరెడ్డి, మహబూబ్ నగర్ కు నీరిచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర ప్రాజెక్టులకు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. యుద్ధమే అని చెప్పుకుని ఢిల్లీ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి రావడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని తమ్మినేని విమర్శించారు. టీఆర్ఎస్ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందన్నారు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగుర నీయొద్దని తెలిపారు. జాతీయంగా ,అంతర్జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. గత 30 ఏళ్లుగా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్న కమ్యూనిస్టు ఉద్యమానికి కష్టాలు కొత్త కాదన్నారు. సామ్రాజ్యవాద అమెరికా సైతం ప్రస్తుతం విలవిలలాడుతుందన్నారు. విషత్కర పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు దేశం సంపదలో ముందుందన్నారు. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ఆచరణ కారణంగానే చైనా అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారన్నారు. అననుకూల పరిస్థితుల్లోనూ నిలబడేవాడే కమ్యూనిస్టు అని తమ్మినేని పేర్కొన్నారు.

 

Related posts

పొంగులేటి ఇంటికి ఈటెల వెళ్లిన విషయం నాకు తెలియదు …అయినా తప్పేమికాదు …బండి సంజయ్!

Drukpadam

కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు …బీజేపీ నేత ఈటల

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్ లో కీలక పరిణామం… పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు?

Drukpadam

Leave a Comment