Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కు మరో మణిహారం

ఖమ్మం కు మరో మణిహారం
కొత్త బస్ స్టేషన్ టెర్మినల్
జనాభాకు తగ్గట్లుగా విస్తరణ పై హర్షతిరేకాలు
మోడరన్ బస్ స్టాండ్ కు హైటెక్ హంగులు
ఖమ్మం అందాలకు మరింత సొగసులు
మంత్రి అజయ్ పట్టుదలకు నిలువుటద్దం
ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన బస్ స్టేషన్ టెర్మినల్ ఖమ్మంకు మరో మణిహారం లాంటిది అనటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన టీ హబ్ ఖమ్మం కు మణిహారం గా బాహించాం. కానీ ఇది అంతకన్నా గొప్పది . రోజుకు 70 వేల నుంచి లక్ష మంది ప్రయాణికులు ఖమ్మం బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొత్త బస్ స్టేషన్ హైటెక్ హంగులతో రూపుదిద్దికొని అత్యంత సుందరంగా తీర్చి దిద్దబడింది . 25 కోట్ల రూపాయలతో , 7.5  ఎకరాల విశాలమైన స్థలంలో దీన్ని నిర్మించటం జరిగింది. రాష్ట్రంలో హైద్రాబాద్ తరువాత 30 ప్లాట్ ఫారాలు ఉన్న బస్ స్టాండ్ ఇదే కావటం విశేషం . రాష్టంలో రాజధానిలో మినహా ఇంత పెద్ద అందమైన బస్ స్టాండ్ రూపుదిద్దుకోవటం ఖమ్మం ప్రజలకు గర్వకారణం . దీని క్రేడిట్ అంతా స్థానిక శాసనసభ్యుడిగా , ఆశాఖామంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కే దక్కుతుంది . కొత్త బస్ స్టాండ్ కావాలనే దానిలో పాత బస్ స్టాండ్ లోకల్ బస్ స్టాండ్ గా మార్చాలనే వారికీ సైతం రెండవ మాటకు తావులేదు.వారుకూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే పాత బస్ స్టాండ్ ను లోకల్ బస్ స్టాండ్ గా ఉపయోగించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వ్యాపారాలు, ఇప్పటి వరకు ఉన్న ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చేవిద్యార్థులకు,ఉపాధి పనులకు వచ్చేవారికి,వ్యాపారులకు నగరానికి నడిబోడ్డున ఉన్న పాత బస్ స్టాండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు వ్యాపారం చేసుకున్నవారు తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. కొత్త బస్ స్టాండ్ నిర్మాణ క్రేడిట్ మంత్రికి ఇవ్వాలనే దాంట్లో కొంతమందికి అభ్యతంరాలు ఉన్నట్లు ఉన్నాయి. ఎవరికాలంలో ప్రారంభమైనా ముగింపు ఎవరు చేశారనేది లెక్క అని టీఆర్ యస్ అంటుంది విషయాన్నీ పక్కన పెడితేతెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఖమ్మం ఒకటిహైద్రాబాద్ తరువాత ఖమ్మం అన్నిరంగాలలో దూసుకుపోతుంది. విద్యా,వైద్య,పారిశ్రామిక రంగాలలో ఖమ్మం నగరం శరవేగంగా విస్తరిస్తుంది. ఇటీవలనే ఖమ్మం కు టీ హబ్ వచ్చింది. కొత్తగా అగ్రహారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ , ముస్తఫానగర్, ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి రఘునాథపాలెం వరకు రోడ్ విస్తరణ , సెంట్రల్లైటింగు , డివైడర్లు ఏర్పాటు, లకారం ట్యాంక్ బ్యాండ్ పై ఊయల బ్రిడ్జి , వాకర్స్ పారడైజ్ ఏర్పాటు మంత్రి పట్టుదలకు తార్కాణంగా నిలిచాయి. అందుకుతగ్గట్లుగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనకు మంత్రి అజయ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయం. ఖమ్మం శాసనసభ్యుడిగా ,జిల్లా మంత్రిగా ఆయన ఖమ్మం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. గతంలోనే 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులను రాష్ట్ర పట్టణాభివృద్ధి, టీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా తరువాత మొదటి సారిగా ఖమ్మం వచ్చినప్పుడు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఎన్నెస్పీ లోని స్థలంలో ఖమ్మం విస్తరణకు తగ్గట్లు బస్ స్టేషన్ నిర్మాణం జరపాలని స్థలం ఎంపిక చేసి చూపించారు. దానిపై సంతృప్తి చెందిన సీఎం ఆరోజే ఖమ్మం కు నూతన బస్ స్టేషన్ మంజూరి చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాత కొంత కాలానికి కేటీఆర్ వచ్చి శంకుస్థాపన చేశారు. నిర్మాణం చాల ఆలశ్యం అయింది. సంవత్సరాలు గడిచింది .తిరిగి అజయ్ రెండవసారి ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తరువాత మంత్రి అయ్యారు. అందులో రవాణా శాఖా ఆయనకే రావటంతో ఖమ్మం బస్ స్టేషన్ దశ తిరిగింది. ఆయన దీనిపై దృష్టి సారించారు. అప్పటినుంచి దీని నిర్మాణ వేగం పెరిగింది. అజయ్ నిరంతర పర్వేక్షణ కారణంగా , ఆలశ్యం అయినప్పటికీ అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధం అయింది. మార్చ్ 1 తేదీ నుంచి కొత్త బస్ స్టేషన్ నుంచి బస్ లను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్లాట్ ఫారాలను అందంగా తీర్చిదిద్దారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ప్లాట్ ఫారంలు నిర్మించారు. వాటికీ నెంబర్లు కేటాయించటంతో పాటు ప్రాంతాలకు ప్లాట్ ఫారంల నుంచి బస్ లు ఉంటాయనే డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు దిగేందుకు 5 ప్లాట్ ఫారంలు అందులో మొదటి ఒకటి నుంచి 5 వరకు కేటాయించారు. ఇప్పటికే ఖమ్మం ప్రజలు అందమైన హై టెక్ బస్ స్టేషన్ చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు. నిజంగా ఖమ్మం చరిత్రలో ఇదొక కలికితురాయి అనటంలో సందేహంలేదు. ఖమ్మం రూపురేఖలు మారాయి. పెరుగుతున్న జనాభా , విస్తరణ కు తగ్గట్లుగా సౌకర్యాలపై మంత్రి కృషి ప్రశంశనీయమైనదే . దీన్ని కొనసాగించి ఖమ్మం ను మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతారని ఆశిద్దాం !!!

Related posts

చంద్రబాబును దాటి.. తెలంగాణ సీఎం కేసీఆర్ అరుదైన రికార్డు!

Drukpadam

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు.. ఇద్దరి అరెస్ట్

Ram Narayana

జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి!

Ram Narayana

Leave a Comment