Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒమిక్రాన్ ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…

ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యాక్సిన్లు పని చేయవన్న మోడెర్నా సీఈఓ.. భారీ లాభాల నుంచి కుప్పకూలిన మార్కెట్లు…

  • 195 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 70 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్ షేర్ వాల్యూ

నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు వెంటనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ చివరి అరగంటలో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ ను ఎదుర్కోలేవని డ్రగ్ మేకర్ సంస్థ మోడెర్నా సీఈవో ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు పతనమై 57,064కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 16,983కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.25%), టైటాన్ కంపెనీ (2.06%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.98%), ఇన్ఫోసిస్ (1.33%), నెస్లే ఇండియా (1.33%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.95%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.08%), బజాజ్ ఆటో (-2.33%), భారతి ఎయిర్ టెల్ (-1.83%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.70%).

Related posts

నాలుగు సార్లు లేఆఫ్స్.. తట్టుకోలేకపోతున్నానంటూ టెకీ ఆవేదన!

Drukpadam

ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్నారు: జో బైడెన్ ఆవేదన!

Drukpadam

పాపం బాలకృష్ణ అమాయకుడు…పెర్నినాని

Drukpadam

Leave a Comment