Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా?: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్!

ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా?: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్!
-అనాథలైన వారి కుటుంబాల ఆర్తనాదాలు వినిపించట్లేదా?
-అధికారపు పొరలు కమ్మి చూపు మందగించిందా?
-రైతులు కోటీశ్వరులయ్యారంటూ బుద్ధిలేని మాటలా?

తెలంగాణలో రైతులు కోటీశ్వరులయ్యారన్న సీఎం కేసీఆర్ మాటలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి బుద్ధిలేని మాటలు మాట్లాడే కేసీఆర్ కు.. ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా? అని నిలదీశారు. అనాథలైన వారి కుటుంబాల ఆర్తనాదాలు వినిపించట్లేదా? అని ప్రశ్నించారు. అధికారపు పొరలు కమ్మి కేసీఆర్ చూపు మందగించిందా? అని మండిపడ్డారు.

అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసి రాష్ట్ర సర్కార్ ను నిలదీశారు. నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా రైతులు కోటీశ్వరులయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టం చేస్తే గిట్టుబాటు ధరలు లేక పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ద్వజామెత్తారు. ఒకపక్క రైతులు పండించిన వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేయడంలేదని కేసీఆర్ చెబుతూనే మరో పక్క తెలంగాణాలో రైతులు లక్షాధికారులయ్యారని చెప్పడం పై మండి పడ్డారు . ఒక పక్క రైతులు పెట్టుబడులు లేక ,గిట్టుబాటు దారులు లేక , ఎరువులు ,పురుగుమందుల ధరలు పెరిగి కొనలేక , ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్న విషయం కేసీఆర్ కు కనిపించకపోవడం దారుణమని రేవంత్ రెడ్డి అన్నారు.

Related posts

సోనియా కరోనా వ్యాక్సిన్ రహస్యంగా ఎందుకు వేయించుకున్నారు :బీజేపీ…

Drukpadam

బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునక్ ఎన్నిక దాదాపు ఖాయమే!

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు …ఓటు వేయని నల్లారి , చిరంజీవి !

Drukpadam

Leave a Comment