అదే ఆప్యాత అవే పలకరింపులు …వరద ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటన!
-చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో పర్యటించిన జగన్
-వరద ప్రభావిత ప్రాంతాలను బాధితులకు ఆప్యాయ పలకరింపు
-ఏపీ దక్షిణాది జిల్లాల్లో జలవిలయం
-నిన్న కడప జిల్లాలో సీఎం పర్యటన
-నేడు చిత్తూరు జిల్లాలో పర్యటన
-వరద బాధితులకు పరామర్శ
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్ రెండు రోజులపాటు పర్యటించి భాదితులను పరామర్శించారు . అయితే జగన్ జనంలోకి వెళ్లారంటే అదే పలకరింపులు అదే ఆప్యాత కనబరిచారు. నేరుగా వారిఇళ్లకు వెళ్లి భాదితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అడగటంతో భాదితులు ఉబ్బితబ్బిబు అయ్యారు. అధికారులు వచ్చారా ? వారినుంచి ఎలాంటి సహకారం అందింది . అంటూ ప్రజలను అడిగారు. ఇసుక మెటా వేసిన పొలాలకు హెక్టర్ కు 12500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. నెల్లూరు లో పెన్నానది ఉదృతికి కొట్టకపోయిన విజయవాడ -చెన్నై జాతీయరహదారి రోడ్ ను సీఎం పరిశీలించారు. పెన్నానది ముంపు ప్రాంతాలను సందర్శించారు.
రాష్ట్రంలో ఇటీవల వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగింది . నిన్న కడప జిల్లాలో పర్యటించిన సీఎం నేడు చిత్తూరు,నెల్లూరు జిల్లాల పర్యటన చేశారు . రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలకు అధికారులు వచ్చారా? సాయం అందించారా? అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ పాపానాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. జిల్లాలో వరద తీవ్రతకు గురైన రహదారులు, భవనాలు, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖకు సంబంధించిన ఫొటోలతో ఏర్పాటైన ఎగ్జిబిషన్ ను కూడా సీఎం పరిశీలించారు.
అటు, తిరుపతి నగరంలోనూ ఆయన పర్యటన కొనసాగింది. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
ఓ కిడ్నీ వ్యాధిగ్రస్తురాలికి సీఎం జగన్ భరోసా
- చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
- బి.కుసుమ అనే కిడ్నీ వ్యాధిగ్రస్తురాలికి పరామర్శ
- ఆమె పరిస్థితి పట్ల చలించిపోయిన జగన్
- చికిత్సకు ఆర్థికసాయం అందిస్తామని హామీ
ఆమెకు తక్షణమే వైద్య చికిత్స అవసరమని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆమె చికిత్సకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు కుసుమ రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.