Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గోవాలో మంత్రి పువ్వాడ కు ఘన స్వాగతం..

గోవాలో మంత్రి పువ్వాడ కు ఘన స్వాగతం..
గోవా పర్యటనకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి.
ఘన స్వాగతం పలికిన గోవ తెలుగు అసోసియేషన్.

రెండు రోజులు పాటు గోవా రాష్ట్ర పర్యటనలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గోవా చేరుకున్నారు శుక్రవారం గోవా రాష్ట్రంకు చేరుకున్న మంత్రి పువ్వాడ కు గోవా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. మంత్రికి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు.మంత్రి హోదాలో మొదటిసారి గోవా రావడంపట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.స్వగతం పలికిన తెలుగు అసోసియేషన్ సభ్యులకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. స్వాగతం పలికిన వారిలో గోవా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ కె.శ్రీనివాస్, బిట్స్ పిలాని ప్రసాద్, సుధాకర్ రెడ్డి, సూరి బాబు, మురళి కృష్ణ, రమణ, కృష్ణ రెడ్డి, ధనుంజయ్ తదితరులు ఉన్నారు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహం మరియు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది.

కేంద్ర భారీ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4న గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్ & స్పా రిసార్ట్, కెనకోనాలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి పాల్గొననున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా నూతన విధానాలను రూపొందించి తాజా విధానాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది.

 

Related posts

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారంటూ పుకార్లు.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

Drukpadam

కాల్వలో కనిపించిన కారు.. యజమాని ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న మిస్టరీ!

Drukpadam

తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్.. కుమారుడి ప్రాణం తీసింది!

Drukpadam

Leave a Comment