Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్!

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్!
ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు
తుపాకీ పేలి ఛాతీలోకి దూసుకుపోయిన బుల్లెట్
జిల్లా ఆసుపత్రికి తరలింపు
ఘటనపై ఎస్పీ ఆగ్రహం

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా, తుపాకీ మిస్ ఫైర్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు తనకు తెలపాలని ఆదేశించారు. కాగా, తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. ఇది అలసత్వమా ? లేక నిజంగానే పొరపాటుగా మిస్ ఫైర్ అయిందా ? అనే కోణంలో పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.శ్రీనివాస్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . పలువురు పోలీస్ ఉన్నతాధికారులు శ్రీనివాస్ రావు ను పరామర్శించారు. డీజీపీ సైతం దీనిపై ఆరా తీసినట్లు తెలిసింది.

Related posts

డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ‘సింగం’ సినిమా విలన్ మెల్విన్!

Drukpadam

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

ముఖేశ్ అంబానీ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం… ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు!

Drukpadam

Leave a Comment