Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు…

ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు…
-తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన రోశయ్య
-కొంపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు
-సీనియర్ నేతకు కడసారి వీడ్కోలు పలికిన ప్రముఖులు
-ఏపీ ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు

అభిమానుల అశ్రునయనాల ,బరువెక్కిన హృదయాలతో రాజకీయ దురంధరుడు , రాజకీయాలకే వన్నె తెచ్చిన మహాపురుషుడు , అవినీతి మకిలి అంటని మహానాయకుడు , తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మహామనిషి మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు హైదరాబాదు శివార్లలోని కొంపల్లి వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.అంతకుముందు రోశయ్య భౌతికకాయాన్ని అమీర్ పేటలోని నివాసం నుంచి గాంధీభవన్ కు తరలించారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యనేతలు తమ ప్రియతమ నేత పార్థివదేహానికి కడసారి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తరఫున మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. బరువెక్కిన గుండెలతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులూ ,కార్యకర్తలు, అభిమానులు , వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరుపున లోకసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వచ్చారు. గాంధీభవన్ లో రోశయ్య లో భౌతిక కాయంపై పుషపగుచ్చాలుంచి నివాళులర్పించారు.అక్కడే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క , జగ్గా రెడ్డి , వి హెచ్ ,షబ్బీర్ అలీ , కెవిపి రామచందర్ రావు , గీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

మధ్యాహ్నం తర్వాత రోశయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. కొంపల్లి ఫాంహౌస్ లో అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు మూడు రోజులపాటు సంతాపదినాలు పాటిస్తున్నాయి.

Related posts

చివ‌రి రోజు నామినేష‌న్ వేసిన పాల్వాయి స్ర‌వంతి…

Drukpadam

బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు అర్జున పిచ్చయ్య(104) మృతి!

Drukpadam

చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్… కొట్టివేసిన సుప్రీంకోర్టు…

Drukpadam

Leave a Comment