Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చిన్నారులను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పిన పంజాబ్ సీఎం!

చిన్నారులను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పిన పంజాబ్ సీఎం!
-తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన ఆనందంలో చిన్నారులు
-రెండోసారి మరింతమందిని హెలికాప్టర్‌లో తిప్పుతానన్న సీఎం
-చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యమన్న చన్నీ

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. హెలికాప్టర్ ఎక్కిన చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తొలిసారి హెలికాప్టర్ ఎక్కడం, అందులోనూ ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడంతో పిల్లలు తెగ సంబరపడిపోయారు. సీఎం కూడా ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని చరణ్‌జిత్ పేర్కొన్నారు. రెండోసారి మరింతమంది పిల్లలను హెలికాప్టర్‌లో తీసుకెళ్లనున్నట్టు సీఎం తెలిపారు.

కెప్టెన్ అమరీందర్‌సింగ్ రాజీనామా తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కెప్టెన్ రాజీనామా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. కాగా, కొత్త పార్టీని ప్రకటించిన అమరీందర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రజల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకునేందుకు చన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక పర్యటనలో మారుమూల ప్రాంతంలో ఒక కుగ్రామంలో పేద ఇంట్లో జరుగుతున్న పెళ్ళికి హాజరై సీఎం చన్నీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి రావడంతో కుటంబసభ్యులు , బంధుమిత్రులు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం గా భాద్యతలు చేపట్టిన చన్నీ ప్రజల్లోకి చొచ్చుకు పోయేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి మరి !

Related posts

జగన్ సొంత గ్రామంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

Ram Narayana

‘మేడిన్ తెలంగాణ’ ఎలక్ట్రిక్ కార్..ఒక్కసారి చార్జ్ చేస్తే 1,200 కిలోమీటర్ల జర్నీ..

Drukpadam

గృహ నిర్బంధంలో భూమా అఖిలప్రియ..

Drukpadam

Leave a Comment