కర్నూల్ కు న్యాయరాజధాని ….? మంత్రి సురేష్ మాటల్లోనే

కర్నూల్ కు న్యాయరాజధాని ….? మంత్రి సురేష్ మాటల్లోనే
క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చేసింది… ఇప్పుడే చెప్ప‌కూడ‌దంటూనే చెప్పేసిన మంత్రి సురేశ్
ఆగ‌స్టు 15 త‌ర్వాత రాష్ట్రంలో ఊహించ‌ని ప‌రిణామాలుంటాయన్న మంత్రి
అమ‌రావ‌తిలో గ‌త ప్ర‌భుత్వం ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డిందని ఆరోపణ
వికేంద్రీక‌ర‌ణ‌తో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న సురేశ్

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం , వికేంద్రీకరణ ,విషయంలో గట్టి పట్టుదలాగానే ఉంది. అందులో భాగంగానే కర్నూల్ కు న్యాయరాజధాని అంటూ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇటివలెనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలనీ అక్కడ నిర్మాణాలను నిర్ణిత వ్యవధిలో పూర్తీ చేయాలనీ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే .రాజధాని అమరావతిలోని ఉండాలని 29 గ్రామాలకు చెందిన రైతులు సుదీర్ఘ దీక్షలు చేశారు . హైకోర్టు ఇచ్చిన ఆర్దర్స్ తో వారు తమ దీక్షలను విరమించారు . ఒక పక్క శానసభ ,మరో పక్క 29 గ్రామాల రైతులు మధ్య మూడు రాజధానులు విషయం ఆశక్తిగా మారింది.జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్పింది. అయినప్పటికీ కోర్ట్ రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లో మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలు చర్చనీయాంశం అయ్యాయి.

ఏపీలో మూడు రాజ‌ధానుల విష‌యంపై రాష్ట్ర మునిసిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చేసింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్ప‌కూడ‌దంటూనే… క‌ర్నూలుకు జ్యుడిషియ‌ల్ కేపిట‌ల్ వ‌చ్చేసింద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇప్పుడే ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని కూడా సురేశ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఆగ‌స్టు 15 త‌ర్వాత ఏపీలో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని చెప్పిన మంత్రి సురేశ్.. ఏం జ‌ర‌గ‌బోతోందో మీరే చూస్తార‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తి చుట్టూ అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఓ సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే అభివృద్ధి జ‌రిగేలా చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకే వికేంద్రీక‌ర‌ణ మంత్రంతో అభివృద్దితో పాటు పాల‌న కూడా అన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తున్నామ‌ని మంత్రి చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: