Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీ కి వంటలు వండనున్న గూళ్ల యాదమ్మ!

 దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే… కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా… కానీ… హైదరాబాద్‌ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు… నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె… అందుకే ఏరికోరి ఎంపికచేశారు…

జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. 10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు వచ్చిందీమెకు. యాదమ్మను బుధవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. కొన్ని వంటలు తయారు చేయించి రుచి చూశారు. ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ… ‘మోదీ సారు తెలంగాణ వంటకాల గురించి అడిగారట. బండి సంజయ్‌ సారు మా యాదమ్మ మంచి వంటకాలు చేస్తోందని చెప్పారట. నన్ను బుధవారం పెద్ద హోటల్‌కు పిలిపించుకున్నారు. కూరగాయలతో భోజనం కావాలన్నారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటివి కూడా తయారు చేస్తాం. పెద్ద హోటల్‌లో ముఖ్యమైన వాళ్ల కోసం వంట చేయమంటున్నారు. మోదీ సారు నేను చేసే వంట తింటారంటే అంతకంటే ఎక్కువ ఏముంటుంది..అదే నాకు భాగ్యం’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారామె.

Related posts

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

Drukpadam

తాడేపల్లి ప్యాలెస్ కూల్చడానికి ఒక్క నిమిషం చాలు: చంద్రబాబు

Drukpadam

మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నంలా ఉంది …ఏబీఎన్, టీవీ5లపై కేసులో సుప్రీం వ్యాఖ్య…

Drukpadam

Leave a Comment