Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు: 5,326 మంది ఓటర్లు …  శశాంక్‌ గోయల్‌

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు, 5,326 మంది ఓటర్లు: శశాంక్‌ గోయల్‌
-5 ఉమ్మడి జిల్లాల్లో 6 స్థానాలకు ఎన్నికలు
-పోలింగ్‌ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్న
-పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని

ఈనెల 10 వతేదీన ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 6 స్థానాలకు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు . శుక్రవారం జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో సీఈవో బుద్దభవన్‌ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శశాంక్‌ గోయల్‌ తెలిపారు.  పోలింగ్‌ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్న ఆయన.. పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఈవో తెలిలిపారు. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ లేదా వీడియోగ్రఫీ ఉంటుందని శశాంక్‌ గోయల్‌ చెప్పారు.

Related posts

వేలంలో రూ.28 లక్షలకు అమ్ముడుపోయిన యాపిల్ ఫోన్!

Drukpadam

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ఖరారు చేసిన కేసీఆర్

Drukpadam

కళకళలాడుతున్న అమెరికా విమానాశ్రయాలు.. లక్షలాదిమందితో కిటకిట

Drukpadam

Leave a Comment