Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ప్రవేటీకరిస్తే భారం పేదలపై పడుతుంది….విద్యుత్ ఉద్యోగసంఘాల

విద్యుత్ ప్రవేటీకరిస్తే భారం పేదలపై పడుతుంది….విద్యుత్ ఉద్యోగసంఘాల
-ప్రవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాపిత ఆందోళన …
-కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉప సంహరించు కోవాలని డిమాండ్
-ఈనెల 15 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ధర్నా
-కేంద్రం స్పందించకపోతే ఫిబ్రవరి 1 న దేశవ్యాపిత సమ్మె

ఖమ్మం నగరంలో మామిళ్లగూడెం ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం ప్రాంతంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2021విద్యుత్ సవరణ చట్ట బిల్లును రద్దు చేయాలని అలాగే విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని నేషనల్ ఇంజనీర్లు , ఉద్యోగుల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉద్యోగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భోజన విరామం సమయంలో ఫ్లకార్డులతో నిరసన ధర్నాను చేపట్టారు . ఈ ధర్నాలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ విరమించాలని , 2021 విద్యుత్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించు కోవాలని కోరినారు . దీనికి వ్యతిరేకంగా 15వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు . ఇంకా ప్రభుత్వం ప్రకటన చేయకపోతే ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు పిలుపునిచ్చారు .

విద్యుత్తు ప్రభుత్వ రంగంలో ఉండడంవల్ల సబ్సిడీల వల్లనే రైతులు , ప్రజలకు కారుచౌకగా విద్యుత్తు లభిస్తోందని , ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే విద్యుత్ రేటు పెరిగి భారమై అన్నీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి దేశ అభివృద్ధి ఆగిపోతుందని , దేశంలో సంక్షోభం వస్తుందని , అభివృద్ధికి కారణమైన విద్యుత్తును ప్రైవేటీకరించం వద్దని , నాయకులు వక్తలు పేర్కొన్నారు . రైతు చట్టాలను రద్దు చేసిన విధంగానే విద్యుత్ చట్టాన్ని చేయబోనని ప్రభుత్వం ప్రకటించాలని అప్పుడు దాకా ఆందోళనలు కొనసాగుతాయని వారు ప్రభుత్వాలను హెచ్చరించారు .

ఈ కార్యక్రమానికి ఇంజనీర్స్ అసోసియేషన్ తరపున డిఈ హీరా లాల్ , 1104 యూనియన్ నాయకులు టీ.శేషగిరి , ( 327 ఎన్ .టి. యు .సి) నాయకులు ఎం. సత్యనారాయణ రెడ్డి , సిఐటియు నాయకులు ఎం. ప్రసాద్ , ఓసీ సంఘ నాయకులు జి . నరేష్ , అకౌంట్స్ ఆఫీసర్ నాయకులు కృపాకర్ , హెచ్ 82 నాయకులు వేణు , మోహన్ మరియు పలువురు నాయకులు , అధికారులు సీతారామ్ , గోపాల్ , సుధాకర్ , పుష్ప రాణి , జ్యోతి సురేష్ , యుగంధర్ , కిలారు నాగేశ్వరావు తదితరులు నాయకత్వం వహించారు

Related posts

ఖేల్ రత్న, అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం!

Drukpadam

This 50 Years Old Woman Reveals Secrets of Beauty Through Eating

Drukpadam

Smartphone Separation Anxiety: Scientists Explain Why You Feel Bad

Drukpadam

Leave a Comment