Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. 5 జిల్లాల్లో కఠిన ఆంక్షలు!

తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. 5 జిల్లాల్లో కఠిన ఆంక్షలు!
-6 స్థానాల‌కు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు
-ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
-పోటీలో 26 మంది అభ్యర్థులు
-ఈ నెల 14న ఎన్నికల ఫలితాల వెల్ల‌డి

తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ‌మైన పోలింగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు జరుగుతోన్న‌ ఐదు జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాలకు కేవలం ఓటర్లను మాత్రమే పంపిస్తున్నారు. చాలాదూరం నుంచి ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే లోపలి అనుమతి ఇస్తున్నారు. వివిధ ప్రాంతాలలో క్యాంపులలో ఉన్న ఓటర్లను నేరుగా పోలింగు కేంద్రాలకు తరలించారు.

ఇటీవ‌లే 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌‌ జారీ అయిన విష‌‌యం తెలిసిందే. అయితే, వాటిలో రంగారెడ్డి, మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాల‌ చొప్పున, అలాగే, నిజామాబాద్‌‌, వరంగల్‌లో ఒక్కో సీటు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, మెదక్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.

కరీంనగర్ లో రెండు సీట్లకు పది మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా, నల్ల‌గొండలోని ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు, ఆదిలాబాద్‌‌లో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీటి ఫ‌లితాలు ఈ నెల 14న వెల్ల‌డి కానున్నాయి. అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్‌‌ పేపర్‌‌లు ప్రింట్‌‌ చేశారు.

ఆయా కేంద్రాలలో ఎమ్మెల్యే సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ , ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ .కల్లూరు లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , కొత్తగూడెంలో ఇల్లందు ఎమ్మెల్యే ,పినపాక ఎమ్మెల్యే , అశ్వారావు పేట ఎమ్మెల్యే ,పినపాక ఎమ్మెల్యే లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ , నిర్మల్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో తెలంగాణ‌ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. భైంసాలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇత‌ర జిల్లాల్లోనూ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది.

Related posts

దేశద్రోహం చట్టంపై మరో పిటిషన్… పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

Drukpadam

చిరంజీవి గారూ, మీ ఇంట్లో వివాదాలు లేవా?… మీ తమ్ముడికి చెప్పండి: అంబటి రాంబాబు…

Ram Narayana

An Iconic Greek Island Just Got A Majorly Luxurious Upgrade

Drukpadam

Leave a Comment