Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వార్ వన్ సైడ్ …టీఆర్ యస్ —గెలుపు మాదే….కాంగ్రెస్!

వార్ వన్ సైడ్టీఆర్ యస్ ….గెలుపు మాదే….కాంగ్రెస్!
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ధీమా
ఖమ్మం పోలింగు కేంద్రం వద్ద ఉద్రిక్తత
ముభావంగా ఓటర్లుఅంతుబట్టని ఓటర్ మనోగతం
టీఆర్ యస్ ఓటర్లు గోవా టు పోలింగ్ కేంద్రం
ఓట్లు వేసిన ఎక్స్ ఆఫీసుయో సభ్యులు ఎంపీ ,ఎమ్మెల్యేలు
గెలుపు ధీమా వ్యక్తం చేసిన మంత్రి అజయ్
ఎన్నికలకు దూరం అన్న సిపిఎం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొందరు పార్టీ ఓటర్లు

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న విధంగానే క్రాస్ ఓటింగ్ భయం వెంటాడింది. అయితే అధికార టీఆర్ యస్ మాత్రం పోలింగ్ అనంతరం వార్ వన్ సైడే అంటుండగా కాంగ్రెస్ గెలుపు మాదే అంటు ధీమా వ్యక్తం చేస్తుంది. టీ ఆర్ యస్ కు క్లియర్ మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు పోటీ చేయడంతో టీఆర్ యస్ నుంచి పోటీచేస్తున్న తాతా మధు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఓటర్లను గోవా తరలించి అక్కడనుంచి హైద్రాబాద్ కు తరువాత పోలింగ్ కేంద్రాలకు నేరుగా తీసుకోని వచ్చి ఓట్లు వేయించారు. మొత్తం 678 మంది ఓటర్లు ఉండగా 736 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఎక్స్ ఆఫీసుయో సభ్యులుగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు , జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలకు గాను 8 మంది ఓటు హక్కు కలిగి ఉండగా 7 గురు తమ ఓటు హక్కును వినియోగిచుకున్నారు. ఒక్క కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు వెన్నుకు ఆపరేషన్ చేయించుకొని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అందువల్ల ఆయన తన ఓటు వేయలేకపోయారు . మిగతా ఎమ్మెల్యేలలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చనాగేశ్వరరావు లు ఏ మున్సిపాలిటీలలో ఎక్స్ ఆఫీసుయో సభ్యులు కానందున వారికీ ఓటు హక్కు లేదు .

గెలుపు తెరాస పార్టీ దే అని మంత్రి పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు. తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడారు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం తెరాస పార్టీదేనని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , పలువురు ప్రజాప్రతినిదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ యస్ వర్గాల అంచనా ప్రకారం తమకు కనీసం 200 కు తగ్గకుండా మెజార్టీ రావడం ఖాయం అంటున్నారు.

క్రాస్ ఓటింగు జరిగిందా ?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ కు క్లియర్ మెజార్టీ ఉంది. కానీ ఆపార్టీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణాలు లేకపోలేదు అభ్యర్థి ఎంపిక ,ప్రచారంలో సీనియర్లను కలుపుకొని పోకపోవడం , డబ్బు పంపిణీలో తేడాలు , ఎమ్మెల్యే లలో స్తబ్దత వెరసి టీఆర్ యస్ కు నష్టం తెస్తుందేమోననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చివరివరకు మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి తాతా మధు గెలుపు భాద్యతను తమ మీద వేసుకున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి అనేది 14 తారీకు వరకు వేచి చూడాల్సిందే . అదే సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు కూడా గెలుపు తనదే అంటున్నారు. ఆయనకు టీఆర్ యస్ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని నమ్ముతున్నారు. అందులో ప్రధానంగా మధిర ,వైరా , ఇల్లందు , కొత్తగూడెం , అశ్వారావుపేట , భద్రాచలం నియోజకవర్గాలలో తమకే ఆధిక్యం ఉందని పేర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 25 ఓట్ల మెజార్టీ గెలుస్తానని ఓట్ల లెక్కలు చెబుతున్నారు.

పోలింగు కేంద్రంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు . ఆయన లోన ఉండి ఓట్లర్లకు డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని బయట ఆందోళనకు దిగటంతో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని వారిని అక్కడనుంచి పంపివేశారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ యస్ వాళ్ళు ఎన్నికల నిబంధనలు తొంగలోతొక్కిన పోలీసులు , ఎన్నికల అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అభ్యర్థి రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.

సిపిఎం నిర్ణయానికి భిన్నంగా పార్టీ ప్రతినిధులు

సిపిఎం ఈ ఎన్నికల్లో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అందుకు భిన్నంగా కొందరు సిపిఎం ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చర్చనీయాంశం అయింది .

Related posts

చైనాలో సైనిక తిరుగుబాటు…కొట్టి పారేసిన వైనం.. జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉన్నారంటున్న నిపుణులు

Drukpadam

కరోనా నేపథ్యంలో ఎన్నికల సభలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ

Drukpadam

అందులో నిజం లేదు …టీడీపీ లో చేరిక పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

Drukpadam

Leave a Comment