Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

  • కర్నూలులో ఘటన
  • స్టాంటన్ పురంలో నివసిస్తున్న కళావతమ్మ
  • కళావతమ్మ ఇంటికి ఓ మహిళ రాక
  • వ్యాక్సిన్ వేస్తామంటూ కళ్లలో చుక్కల మందు
  • కళ్లు మూసుకోగానే బంగారు గొలుసుతో పరార్

కర్నూలులో ఓ కిలాడీ కరోనా వ్యాక్సిన్ పేరుతో చోరీకి పాల్పడింది. పట్టణంలోని స్టాంటన్ పురం కాలనీలో కళావతమ్మ అనే మహిళ నివసిస్తోంది. కాగా, కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామంటూ ఓ మహిళ కళావతమ్మ ఇంటికి వచ్చింది. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు కళ్లలో చుక్కల మందు వేసుకోవాలని నమ్మించింది. నిజమేనని భావించిన కళావతమ్మ కళ్లలో చుక్కల మందు వేయించుకుంది.

మందు కారణంగా కళావతమ్మ కళ్లు మూసుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసును ఆ మాయలాడి తెంచుకుని పారిపోయింది. దాంతో కళావతమ్మ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే ఆ మహిళ అక్కడ్నించి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Related posts

తోటి జవాన్లపైకి సైనికుడి కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు!

Drukpadam

సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్…

Drukpadam

హంతకుడిని పట్టిచ్చిన హెడ్ సెట్…

Ram Narayana

Leave a Comment