Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్టాలిన్ కే తమిళ ప్రజలు పట్టం కట్టనున్నారా …?

స్టాలిన్ కే తమిళ ప్రజలు పట్టం కట్టనున్నారా …?
-చిన్నమ్మ శిభిరం ఏమి చేయబోతుంది
కమల్ హాసన్ బోణి కొడతాడా ?
-బీజేపీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా ?
-పళని స్వామి పాచిక పడుతుందా ?
శాసనసభ కు ఎన్నికలు జరుగుతున్నా వేళ తమిళనాట రాజకీయాలు ఆశక్తిగా మారాయి. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి సీటుకోసం ఎదురు చూస్తున్న ఎం కే స్టాలిన్  కలలు నెరవేరుతాయా అంటే అవుననే అంటున్నాయి సర్వేలు . ఏ బి పి, సి ఓటర్ సంయుక్తంగా నిరాయించిన సర్వేలో డి ఎం కే కూటమికి స్పష్టమైన మైజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది . రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు    దక్షిణాదిన అత్యంత అభివృద్ధిని చెందిన రాష్ట్రంగా పేరున్న తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలు కొన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఇక్కడ పార్టీలు మొదటి నుంచి సినిమాలతో ముడివడి ఉన్నాయి . తమిళనాడును ఎక్కువకాలం పాలించిన కరుణానిధి గాని , ఎం జి ఆర్ గాని, జయలలిత గాని  సినీ రంగంకు చెందినవారే. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రశ్న. .అయితే సర్వేలు మాత్రం ఈ సారి కచ్చితంగా డి ఎం కే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. 2016  ఎన్నికల్లో సైతం డి ఎం కే వస్తుందని చెప్పిన జయలలిత తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆమె పదవి కలం పూర్తీ కాకుండానే ఆనారోగ్యంతో మరణించారు.నాటి నుంచి ఏ ఐ డి ఎం కే లో ఆధిపత్య పోరు మొదలైంది.ఇంటి పోరుతో విసుగు చెందిన తమిళ ప్రజలు ఈసారి మార్పును కోరుకొంటున్నారని సర్వేల సారాంశం . 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6 న ఒకే రోజు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
డి ఎం కే ,కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అధికారం లో ఉన్న ఏ ఐ డి ఎం కే కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న డి ఎం కే వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది . ఇందుకు కారణం లేక పోలేదు . జయలలిత మరణించిన తరువాత తమిళనాట కుర్చీకోసం జరిగిన కొట్లాటలు ప్రజల్లో ఆపార్టీ పట్ల వ్యతిరేకతను పెంచాయి. అంతే కాకుండా జయలలిత నెచ్చెలి శశికళ సీఎం కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుపడిందని ఆమెను అవినీతి ఆరోపణలతో జైలుకు పంపించారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడున్న పళని స్వామి ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని భావన ఉంది. బీజేపీ ,ఏ ఐ డి ఎం కే కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి . ఇక మూడవ కూటమిగా కమల్ హాసన్ , మరికొన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నారు .అన్ని కూటములలోకి డి ఎం కే ,కాంగ్రెస్ కూటమికే ప్రజలు ముగ్గు చూపుతున్నారనేది ఏ బి పి ,సి ఓటర్ సర్వే చెబుతుంది . రాష్ట్రంలో  234  అసెంబ్లీ సీట్లు ఉండగా , ఆ సర్వే ప్రకారం డి ఎం కే కూటమికి 41 శాతం ఓట్లతో 154 నుంచి 162 సీట్లు వచ్చే ఆవకాశం ఉంది. ఏ ఐ డి ఎం కే ,బీజేపీ కూటమికి 28 .61 శాతం ఓట్లతో కేవలం 58 నుంచి 66 సీట్లు మాత్రమే వచ్చే ఆవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాట జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. తెలుగు ప్రజలు కూడా ప్రభావితం చేసే ప్రాంతాలు ఉండటంతో అక్కడ ఆయాపార్టీలకు చెందిన తెలుగు నేతలు ప్రచారం నిర్వవించేందుకు వెళ్లారు . ప్రతీకారంతో రగిలిపోతున్న శశికళ అన్నా డీఎంకే నేతలైన పళని స్వామి, పన్నీరు సెల్వంలపై కసితో ఉన్నారు. అందువల్ల ఆమె ఇప్పుడు డీఎంకే కన్నా అధికారంలో ఉన్న నేతలనే టార్గెట్ చేస్తారా ?లేదా ? అనేది ఆశక్తిగా మారింది. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యాం పార్టీ మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నందున ఎన్నిసీట్లు వస్తాయనే లెక్కలు వేస్తున్నారు.బీజేపీ , అన్నా డీఎంకే తో జట్టు కట్టినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేక పోవచ్చునని అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . ఎన్నికల సర్వేలు నిజం అవుతున్నాయా ? లేదా ? అంటే బీహార్ లో జరిగిన ఎన్నికలలో ఒకటి రెండు మినహా అన్ని సర్వేలు ఆర్ జె డి అధికారంలోకి వస్తుందని తేల్చాయి కానీ తీరా ఫలితాలు అందుకు భిన్నంగా జేడీఎస్ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే . మరి చూడాలి తమిళనాట ఏమి జరుగుతుందో !!!

 

 

Related posts

బీజేపీలో గందరగోళం…కొత్తగా వచ్చిన వారిని నిలబెట్టుకునేందుకు పదవుల పందారం …

Drukpadam

అవినీతి చీడపురుగు అంటూ బాలినేని పై నారా లోకేష్ ఫైర్ …

Drukpadam

మోడీగారు గుజరాత్ కో న్యాయం…తెలంగాణ కో న్యాయమా!…సండ్ర

Drukpadam

Leave a Comment