స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన…?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేశంలోని 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మిగతా రాష్ట్రాలలో కూడా ఎన్నికలు వాయిదా వేయమన్న అలహాబాద్ హైకోర్టు
కోవిడ్ ,ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాలు
వీటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా సూచనలు చేసింది కోర్టు. ఎన్నికలు జరపడం వల్ల మహమ్మారి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి తెలిపింది కోర్టు. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి యూపీ ఎన్నికలపై స్పందించిన తీరు సంచలనంగా మారింది. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్ హీట్ పెంచింది.
యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు
యూపీలో రాష్ట్రపతి పాలన రాబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడబోతున్నాయి అంటూ ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాలను పంచుకున్నారు స్వామి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు స్వామి. “ఒమిక్రాన్‌తో లాక్‌డౌన్, యూపీలోలో రాష్ట్రపతి పాలన.. యూపీ ఎన్నికలను సెప్టెంబర్‌కు వాయిదా వేయడం గురించి ఆశ్చర్యపోకండి.. ఈ సంవత్సరం ప్రారంభంలో నేరుగా చేయలేనిది వచ్చే ఏడాది ప్రారంభంలో పరోక్షంగా చేయవచ్చు” అంటూ రాసుకొచ్చారు.