Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రపంచంలో అత్యంత పురాతనమైన భాషలు ఏంటో తెలుసా…?

ప్రపంచంలో అత్యంత పురాతనమైన భాషలు ఏంటో తెలుసా…?

  • ప్రపంచంలో ఇప్పటికీ పలు పురాతన భాషలు
  • వాటిలో కొన్ని వాడుక భాషలుగా చలామణీ
  • ప్రజల వాడుకే భాషలకు మనుగడ
  • ప్రాచీన కాలం నుంచి వారసత్వ సంపదగా భాష

భావవ్యక్తీకరణకు మానవుడు ఎంచుకున్న మార్గం భాష. పురాతనకాలం నుంచి మానవాళికి వారసత్వంగా వస్తున్న వాటిలో భాష ప్రధానమైనది. భాష కారణంగానే చరిత్ర ఇంకా మిగిలుంది. భాష వల్ల భావితరాలకూ ఆ చరిత్ర పదిలంగా నిలుస్తుంది.

అయితే ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో నాగరికతలకు అనువుగా విలసిల్లిన భాషలు కాలక్రమంలో కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. కొన్ని అత్యంత పురాతన కాలం నుంచి ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. అయితే ఏ భాష ముందు పుట్టింది అని చెప్పడం కొంచెం కష్టమైన విషయం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే పురాతన భాషలు కొన్ని ఉన్నాయి.

తమిళ్…
భారతదేశంలో తమిళం మాట్లాడేవారి పేరుతో ఏకంగా తమిళనాడు రాష్ట్రమే ఉంది. ఇప్పటివరకు సజీవంగా నిలిచిన అత్యంత పురాతన భాషగా తమిళం వర్ధిల్లుతోంది. తమిళ భాషను ప్రపంచవ్యాప్తంగా 78 మిలియన్ల మంది మాట్లాడతారు. భారత్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో తమిళులు ఉన్నారు. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన తమిళం… తమిళనాడు రాష్ట్ర అధికార భాష. 3వ శతాబ్దం నుంచే తమిళం ఉందనడానికి ఆధారంగా అనేక శాసనాలు లభ్యమయ్యాయి.

సంస్కృతం…
క్రీస్తుపూర్వం 600వ సంవత్సరం నాటికి విస్తృతంగా వాడుకలో ఉన్న సంస్కృతం దేవభాషగా పేరొందింది. అయితే కాలక్రమంలో దీని వాడుక తగ్గిపోయింది. వేద సంబంధ భాషగా గుర్తింపు పొందిన సంస్కృతం హిందు, బౌద్ధ, జైన మతాల్లో విస్తృతంగా ప్రాచుర్యంలో ఉండేది. సంస్కృతానికి సంబంధించిన ఋగ్వేదం మొట్టమొదటి గ్రంథంగా పేర్కొంటారు. ఆ లెక్కన చూస్తే సంస్కృతం క్రీస్తుపూర్వం 1500 నుంచి వాడుకలో ఉన్నట్టు భావించాలి.

ఐస్ లాండిక్…
స్కాండినేవియా దేశం ఐస్ లాండ్ అధికారిక భాష ఐస్ లాండిక్. ఈ భాషను ఐస్ లాండ్ లోనే కాక డెన్మార్క్, అమెరికా, కెనడా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడతారు. ఇది బహుశా 9, లేక 10వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన పురాతన భాష అని గుర్తించారు. అందుకు తగ్గ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.

చైనీస్…
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే పురాతన భాషల్లో చైనీస్ కూడా ఒకటి. ప్రపంచంలో చైనీస్ భాషను 1.2 బిలియన్ల మంది మాట్లాడతారు. ఇది ప్రధానంగా చైనా, టిబెట్, హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తదితర దేశాల్లో వాడుకలో ఉంది. చైనీస్… సైనో టిబెటన్ భాషా సమూహాలకు చెందిన ఈ భాష. ఇందులో అనేక సంక్లిష్టమైన యాసలు ఉన్నాయి.

హిబ్రూ…
ప్రపంచంలో అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న భాషల్లో హిబ్రూ ఒకటి. ఇది ప్రధానంగా యూదుల భాష. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్లో హిబ్రూ భాష వాడుకలో ఉంది. పునరుజ్జీవ క్రమంలో హిబ్రూ భాషను ఇజ్రాయెల్ దేశ అధికార భాషగా ప్రకటించారు.

ఫారసీ…
పలు ఇస్లామిక్ దేశాల్లో ఇది ప్రాచుర్యంలో ఉంది. ఈ పురాతన భాషను ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ దేశాల్లో విరివిగా మాట్లాడుతుంటారు. గ్రాంథిక పర్షియా భాష నుంచి ఫారసీ భాష రూపొందింది.

బాస్క్…
యూరప్ లో ఇదొక పురాతన భాష. ఫ్రాన్స్, స్పెయిన్ లో ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇండో-యూరప్ నాగరికతకు ముందు కాలం నాటి నుంచి ఇది వాడుకలో ఉన్నట్టు మానవ వికాస శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అయితే దీని పుట్టుకకు సంబంధించిన సమయం, ప్రాంతం కచ్చితంగా తెలియవు. ఈ భాషకు సంబంధించి ఎన్నో అంశాలు నేటికీ మిస్టరీగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎంత పరిశోధన చేసినా బాస్క్ భాష గుట్టు విప్పలేకపోయారు.

అరబిక్…
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఐదవ స్థానంలో ఉండే భాష అరబిక్. ప్రపంచవ్యాప్తంగా 270 మిలియన్ల మంది అరబిక్ మాట్లాడుతుంటారు. 26 రాజ్యాల్లో ఇది అధికారిక భాష. అరేబియా ద్వీపకల్పంలో ఉద్భవించిన అరబిక్ క్రమంగా మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా వరకు విస్తరించింది.

Related posts

మోదీ సర్కారుపై లోక్ సభలో విరుచుకుపడిన అసదుద్దీన్ ఒవైసీ!

Drukpadam

కాంగ్రెస్ వైఫల్యమే బిజెపి ఎదుగుదల కారణం …సిపిఐ పోరు యాత్రలో వక్తలు …

Drukpadam

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త!

Drukpadam

Leave a Comment