Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కన్యాకుమారి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారా…?

కన్యాకుమారి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారా…?
డీఎంకేతో కాంగ్రెస్ దోస్తీ … 24 సీట్లకు అంగీకారం
-రాహుల్ జోక్యం …డీఎంకే తో రాయబారం
-కన్యాకుమారి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ కే
తమిళనాడు లోని కన్యాకుమారి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ రంగంలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతుంది. 2019 లోకసభ ఎన్నికల్లో డీఎంకే మద్దతుతో ఇక్కడనుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ .వసంతకుమార్ గెలుపొందారు. కరోనా మహమ్మారితో ఆయన ఆగస్టు లో మృతు చెందారు.దీనితో ఖాళీ అయినా సీటు నుంచి ప్రియాంక గాంధీని పోటీలో నిలపాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ ,డీఎంకే పొత్తుకు బీటలు పారాయని జరుగుతున్నా ప్రచారం నేపథ్యంలో తాజాగా
ఎట్టకేలకు డీఎంకే ,కాంగ్రెస్ పార్టీల మధ్య తమిళనాడులో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు కుదిరింది. కాంగ్రెస్ కు 24 సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది . చెన్నై లోని స్టాలిన్ నివాసంలో రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. రెండు పార్టీలు దీనిపై ఆదివారం ఉదయం సంతకాలు చేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యంతో సీట్ల సర్దుబాటుకు తమిళ కాంగ్రెస్ నేతలు అంగీకరించారు. అంతకుముందు సీట్ల సర్దుబాటు పై ప్రతిష్టంభన ఏర్పడటం తో వారిమధ్య చిరకాల స్నేహానికి బీటలు బారినట్లేనని అందరు భావించారు. కానీ రాహుల్ గాంధీ ప్రత్యేక చొరవ వాళ్ళ తిరిగి స్టాలిన్ తో చర్చలు జరిపిన కాంగ్రెస్ కు 24 మించి అదనంగా దక్కలేదు. 2011 ఎన్నికల్లో డీఎంకే తో పొత్తుతో 63 సీట్లకు పోటీచేసిన కాంగ్రెస్ 2016 ఎన్నికల్లో 41 సీట్లకు పోటీచేసి కేవలం 8 సీట్లలో మాత్రమే గెలిచింది. 33 సీట్లలో కాంగ్రెస్ వల్ల తమ ప్రత్యర్థులు గెలిచారని అందువల్లనే తమకు రావాల్సిన అధికారం రాకుండా పోయిందని డీఎంకే వాదం .అందువల్ల ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు తొలుత కేవలం 16 సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది . కాంగ్రెస్ 30 సీట్లు కావాలని పట్టు పట్టింది. చివరకు 24 సీట్లతో పాటు కన్యాకుమారి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ కు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.

Related posts

కడియం శ్రీహరితో వివాదానికి తెరపడింది: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య

Drukpadam

పాద‌యాత్ర పేరుతో దండ‌యాత్ర‌కు వ‌చ్చే వారిని అడ్డుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి

Drukpadam

వామ్మా బాబోయ్ ఇంతమంది పోలీసులా? ఇది ఎన్నికనా?? యుద్దమా ???

Drukpadam

Leave a Comment