Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తాగండి తాగి! తాగి ఊగండి !! ఇది కేసీఆర్ ప్రభుత్వం తీరు ;సీఎల్పీ నేత భట్టి ధ్వజం!

తాగండి తాగి! తాగి ఊగండి !! ఇది కేసీఆర్ ప్రభుత్వం తీరు ;సీఎల్పీ నేత భట్టి ధ్వజం!
-ఊరూరా బారుషాపులు …బెల్ట్ షాపులు
-వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోడీ, కేసీఆర్
-నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం తగదు*
-అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందే
-జనవరి లో పాదయాత్ర
-ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర

“తాగండి, తాగి ఊగండి, ప్రభుత్వానికి పన్నులు కట్టండి.” అన్నట్లుగా ఉంది కేసీఆర్ పాలన అంటూ కేసీఆర్ పాలనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు . ఊరి, ఊరికి వైన్స్ బెల్ట్ దుకాణాలను ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల ల్లో సాధించిన అభివృద్ధి ఇది ఒకటేనని ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పథకాలు తీసుకురావాలని సూచించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.

వ్యవసాయ రంగాన్ని కావాలనే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు సంక్షోభంలోకి నెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు . బడా వ్యాపారులు కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు. యాసంగి వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మెడలు వంచుతామని, రైతులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు.

టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2.30 లక్షల కోట్లు దోపిడి జరుగుతుందని ఆరోపించారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతున్నదని ధ్వజ మెత్తారు. రైతుబంధు పేరిట ఎకరానికి 5వేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏటా 50 వేల వరకు నష్టపరుస్తుంది అని వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై సమర శంఖాన్ని పూరించడానికి ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో జనవరి 9 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను అసెంబ్లీకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై తన గళం వినిపిస్తానని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులను వరి సాగు చేయోద్దని సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరిని ఏ విధంగా సాగు చేస్తారని ప్రశ్నించారు. వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకోవాలన్న సీఎం కేసీఆర్
ఉరి వేసుకోవడానికి వరి సాగు చేశారా అని నిలదీశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని మాట తప్పిన కేసీఆర్ దళితుడికి ప్రతిపక్ష హోదా వస్తే కూడా జీర్ణించుకోలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అజిత్ పవార్ అటు వైపు వెళ్లడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయి: రాజ్ థాకరే…

Drukpadam

కుప్పంలో దొంగ ఓట్లు …ప్రజాస్వామ్యం అపహాస్యం …చంద్రబాబు మండిపాటు

Drukpadam

వచ్చే ఎన్నికల్లో జగన్ సీట్ల సంఖ్య 15 నా ?51 నా ?? లోకేష్ సంచలన వ్యాఖ్యలు …!

Drukpadam

Leave a Comment