Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని మోడీ పై ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ ప్రసంశలు…

ప్రధాని మోడీ పై ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ ప్రసంశలు…
-ప్రధాని మోదీ ఒక పని ప్రారంభిస్తే.. పూర్తయ్యే వరకు విశ్రమించరన్న శరద్ పవార్
-పాలనపై చక్కని పట్టు…అదే ఆయన బలం
-మాజీ ప్రధానుల్లో ఇది కనిపించదు
-తన అభిప్రాయాలను వెల్లడించిన పవార్

రాజకీయ కురువృద్ధుడు మరాఠా నేత శరద్ పవార్ ఉన్నట్టు ఉండి ప్రధాని మోడీ పై ప్రసంశలు కురిపించారు. ఇది ఆయనతో పాటు వేదిక పంచుకొని ప్రసంశలు కురిపిస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు …కానీ పవార్ పూణే లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా పని ప్రారంభిస్తే ఆదిపూర్తి అయ్యేవరకు వదిలిపెట్టారని కితాబు నిచ్చారు. పైగా దేశంలో ఇప్పటివరకు పరిపాలించిన ప్రధానులు ఎవరు ఇలా లేరని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు .దేశ రాజకీయ రంగంలో శరద్ పవార్ ఎంతో సీనియర్. ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పార్టీ నేతలను విమర్శించడమే కాదు.. తనకు నచ్చితే మెచ్చుకోవడానికి ఆయన తటపటాయించరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు ఆశక్తి కలిగిస్తున్నాయి. దీనిపై స్వంత పార్టీ వారితోపాటు ప్రతిపక్షాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మండి పడుతున్నాయి. దేశవ్యాపితంగా మోడీ ప్రభ తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో శరద్ పవార్ లాంటి తలపండిన రాజకీయనేత నోట ఇలాంటి మతాల రావడం ఆశక్తి రేపుతోంది. దీనికి ఏదైనా రహస్య ఎజెండా ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు శరద్ పవార్ ఏమన్నాడో చూద్దాం …..

ప్రధాని నరేంద్ర మోదీకి పాలనపై పట్టుందని, అదే ఆయన బలమని శరద్ పవార్ అన్నారు. పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పవార్ మాట్లాడారు. ప్రధాని తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే విషయంలో అధికారులు, మంత్రులను ఒక్కతాటిపైన నడిపిస్తారని పవార్ చెప్పారు. ‘‘ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోదీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు’’ అని పవార్ పేర్కొన్నారు.

Related posts

అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం… హాజరైన సీఎం జగన్

Drukpadam

ఏపీలో వలంటీర్ కు ఉన్న అధికారం ఎమ్మెల్యేకి కూడా లేదు: ఎమ్మెల్యే ఆనం

Drukpadam

ఆరెస్సెస్, బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: జస్టిస్ చంద్రు!

Drukpadam

Leave a Comment