Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భర్త, కుమారుడిని కట్టేసి మహిళపై దుండగుల అత్యాచారం!

భర్త, కుమారుడిని కట్టేసి మహిళపై దుండగుల అత్యాచారం!

  • ఒడిశాలో దారుణ ఘటన
  • ఇంట్లోకి దూరి సామూహిక అత్యాచారం
  • ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎవరికి ఎన్ని శిక్షలు పడినా… వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఒడిశాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై ఆమె భర్త, కుమారుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అదే సమితిలోని కుములిపుట్ పంచాయతీకి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు అతని భార్యపై కన్నేశారు. అతని ఇంట్లోకి వెళ్లి భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు.

జరిగిన దారుణంపై తన భార్యను తీసుకుని పోలీసులను భర్త ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మీణా హరిజన్ ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కామాంధులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

మంచిర్యాల జిల్లాలో ఘోరం …నిద్రలోనే మంటల్లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు …పలు అనుమానాలు !

Drukpadam

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం…!

Drukpadam

Leave a Comment