Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

10 నెలలుగా జీతాలులేని ప్రభుత్వహాస్పిటల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు

10 నెలలుగా జీతాలులేని ప్రభుత్వహాస్పిటల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు
-సి ఐ టి యు ఆధ్వరంలో విధులు బహిష్కరించి ఆందోళన
-వారంరోజుల్లో జీతాలు క్లియర్ చేస్తామని కాంట్రాక్టర్ హామీ

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పటల్ లో పనిచేస్తున్న కార్మికుల పట్ల అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. కరోనా సమయంలో తీసుకున్న కార్మికులకు కు పది నెలలుగా జీతాలు ఇవ్వకుండా పస్తులతో పని చేయమని ఒత్తిడి చేస్తున్నారని జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. కార్మికుల ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు, యూనిఫాంలు సక్రమంగా ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో అధికారులు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి వారం రోజుల్లో పూర్తి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురుమూర్తి, విజయమ్మ, కమల, వెంకటరమణ, పద్మ ఉపేందర్, రామారావు, అనూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

How To Make Perfect Salad That Good For Your Skin

Drukpadam

2013లో మోదీ లక్ష్యంగా బాంబు దాడుల కేసు.. 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు!

Drukpadam

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట… సస్పెన్షన్ ను కొట్టివేసిన క్యాట్…

Ram Narayana

Leave a Comment