Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం!
-త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
-ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో పోలింగ్
-యూపీలో ఏడు దశల్లోనూ పోలింగ్
-పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు
-మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్

ఓమిక్రాన్ పెద్ద ఎత్తున విజృభిస్తున్న వేళ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు చెప్పినప్పటికీ బేఖాతర్ చేస్తూ రాజకీయపార్టీలు ఎన్నికలు జరపాలసిందేనని ఎన్నికలసంఘానికి చెప్పటం , ఒకవేళ వాయిదా వేయాల్సి వచ్చిన సాంకేతిక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశ్యం తో ఎన్నికల షడ్యూల్ ప్రకటించింది . దీనితో 7 దశల్లో ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించారు.

పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న జరిగే తొలిదశ పోలింగ్ తో ఎన్నికలు షురూ అవుతాయి. ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరగనుంది.

403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 23, మార్చి 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది.

కాగా, తొలిదశ ఎన్నికల కోసం జనవరి 14న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 21. జనవరి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జనవరి 27. ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది.

Related posts

ప్రీతిని వేధిస్తున్నారని తెలిసినా హెచ్ఓడీ పట్టించుకోలేదు: ఈటల రాజేందర్!

Drukpadam

రాహుల్ జోడో యాత్రలో పోతురాజు ఆట …

Drukpadam

అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..

Drukpadam

Leave a Comment