హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మంజిల్లా కలెక్టర్ కర్ణన్
ప్రభుత్వ పథకాల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోని కలెక్టర్
కోర్టు ధిక్కరణ శిక్ష విధించిన జడ్జి
తెలంగాణ హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ క్షమాపణ చెప్పారు. దీంతో, ఆయనకు విధించిన కోర్టు ధిక్కరణ శిక్షను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విన్నపాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణన్ పట్టించుకోలేదు. దీంతో, హైకోర్టు సింగిల్ జడ్జి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ శిక్షను విధించారు. అంతేకాదు, రూ. 500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై కర్ణన్ అప్పీల్ చేశారు. దానిపై ఈరోజు విచారణ జరగగా… కోర్టుకు కర్ణన్ క్షమాపణ చెప్పారు. దీంతో, కోర్టు ధిక్కరణ శిక్షను ధర్మాసనం రద్దు చేసింది.
next post