Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓట్ల కోసమే పీఆర్సీ నా… ?

ఓట్ల కోసమే పీఆర్సీ నా… ?
-పీఆర్సీ ప్రకటన పచ్చి మోసం -బండి సంజయ్
-ఓటమి భయంతోనే పీఆర్సీ ప్రకటన -ఉత్తమ్
-ఫిట్ మెంట్ డ్రామా -భట్టి
కోడ్ ఉండగా పీఆర్సీ లీకా-రఘునందన్ రావు
-ఈసీ చర్యలు తీసుకోవాలి -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-ఇది ముమ్మాటికీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే -ప్రొఫెసర్ నాగేశ్వర్
ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ పై ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పట్టభద్రుల ఎన్నికలు సానుకూలంగా మారాయి. గత 33 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నా పీఆర్సీ , ఉద్యోగుల వయో పరిమితి పెంపు పై ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారని ఎన్నికల కోడ్ ఉన్నందున అవి ముగియగానే ప్రకటన వెలువడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు మీడియా సమావేశంలోనే వెల్లడించారు. వేతన సవరణ కమిటీ కేవలం 7 .5 శాతం ఫిట్మెంట్ ప్రకటించగా ,ముఖ్యమంత్రి పెద్ద మనసుతో దాన్ని 29 శాతానికి అంగీకరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 27 శాతం ఐ ఆర్ ఇచ్చినందున వాళ్ళకంటే ఎక్కువగా ఇద్దామని 2 శాతం పెంచి సీఎం గొప్ప ఔదార్యాన్ని చాటారని ఆయన పై నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై సుదీర్ఘంగా కసరత్తు జరిగింది. ఇదే ముఖ్యమంత్రి 33 నెలలుగా కాలయాపన ఎందుకు చేశారు. ఇప్పుడు ఉద్యోగుల మీద ఎందుకు ప్రేమ కలిగింది అనేది ప్రతి పక్షాల ప్రశ్న ? వరస ఎన్నికల దెబ్బలతో ఖంగారు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు తన ముందున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. జిల్లాలో తిరుగుతున్న మంత్రులను ఉద్యోగులు పీఆర్సీ పై నిలదీస్తున్నారు. పీఆర్సీ ఇవ్వకపోతే , ఓట్లు ఉద్యోగ సంఘాల నాయకులూ చెప్పిన ఓట్లు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయవద్దని తీర్మానించుకుంటున్నారు. ఈ విషయాన్నీ నిఘావర్గాలు కూడా పసిగట్టాయి. విషయం ముఖ్యమంత్రి వద్దకు చేరింది.దీంతో ఉద్యోగులకు అంత తొందరగా అపాయింట్ మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులూ అడిగిందే తడువుగా అపాయింట్ మెంటు ఇచ్చి వారితో 5 గంటలకు పైగా చర్చించి 29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంతో పాటు , ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలు పెంచుతానని వారికీ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అధిముగయగానే దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు . దీనితో ఉద్యోగ సంఘాల నాయకులూ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. తాము అనుకున్న విధంగా ఫిట్ మెంట్, ఉద్యోగుల వయోపరిమితి సాధించుకున్నామని సంబర పడుతున్నారు. కానీ ప్రతి పక్ష పార్టీలు దీన్ని ఎన్నికల జిమ్మిక్కుగా , మోసంగా అభివర్ణిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఓటమి భయంతోనే కేసీఆర్ పీఆర్సీ అంటూ కొత్త రాగం అందుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ఉద్యోగుల ఓట్ల కోసమే అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఓట్లకోసమే ఫిట్ మెంట్ డ్రామాగా కొట్టి పారేశారు. ఇంతకాలం ఎందుకు ఫిట్ మెంట్ ప్రకటించలేదు చెప్పాలని అన్నారు. ఉయోగులు కేసీఆర్ మాటలను నమ్మొద్దని పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఇది పచ్చి మోసం ఉద్యోగులను మోసం చేసేందుకే అని అన్నారు. ఎన్నికలు ఉండగా పీఆర్సీ లీకా ఈసీ చర్యలు తీసుకోమలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయన ప్రకటించాక పోయిన ఉద్యోగ సంఘాల ద్వారా ప్రకటింప చేయటం కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తున్నదని ప్రొఫెసర్ కే .నాగేశ్వర్ అన్నారు. అసలు కోడ్ ఉండగా ఒక ప్రభావితం చేసే ఆశంపై స్వయానా ముఖ్యమంత్రి చర్చించరాదని ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే అని ప్రముఖ న్యాయవాది బీజేపీ కి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే ఆవకాశం ఉందా లేదా అనేదానిపై తర్జన భర్జనలు మాత్రం జరుగుతున్నాయి. ఉద్యోగులు మాత్రం తమకు వచ్చిన ఈ ఆవకాశం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ఈటల రాజేందర్ ఢిల్లీ టూర్ పై టీఆర్ యస్ లో కలవరం…

Drukpadam

సీఐడీ నోటీసుల‌పై స్పందించిన ర‌ఘురామకృష్ణ‌రాజు

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం… ‘అపోహలు-వాస్తవాలు’ పేరిట ప్రకటన విడుదల!

Drukpadam

Leave a Comment