కాంగ్రెస్ లోకసభ పక్షనేతగా రవనీత్ సింగ్ బిట్టు
-పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న ఆధీర్ రంజన్ చౌదరి
-సభ గౌరవ్ గొగోయ్ కూడా అస్సాం ఎన్నికల బిజీ
లోకసభ లో కాంగ్రెస్ పక్ష నేతగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రవనీత్ సింగ్ బిట్టు ను నియమించింది. పంజాబ్ లోని లూథియానా లోకసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు .45 సంవత్సరాల బిట్టు పంజాబ్ యూత్ కాంగ్రెస్ నేతగా ఎదిగారు . మొదటి సారిగా ఆయన 2009 లోకసభ ఎన్నికల్లో బిట్టు ఆనందాపూర్ సాహెబ్ లోకసభ కు ప్రాతినిధ్యం వహించారు.గత మూడు పర్యాయాలు ఆయన లోకసభ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన లోకసభలో కాంగ్రెస్ పార్టీ విప్ గా ఉన్నారు. లోకసభలో కాంగ్రెస్ పక్షనేత ఆధీర్ రంజన్ చౌదరి బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా , ఎన్నికలలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరు కావటం కుదరనందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. డిప్యూటీ లీడర్ గా ఉన్న సభ గౌరవ్ గొగోయ్ కూడా అస్సాం ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ కు తాత్కాలికంగా లోకసభలో నాయకుడిగా బిట్టును నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ కు లేఖ అందచేసింది.బిట్టు రైతు ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవరిస్తున్నారు. సింగు బోర్డర్ లో జరిగిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవాడే రవనీత్ బిట్టు కావడం విశేషం . తమ రాష్ట్రానికి చెందిన బిట్టు నియామకం పట్ల పంజాబ్ కాంగ్రెస్ విభాగం హర్షం ప్రకటించింది .
previous post
next post