Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కుంభమేళాకు 28 లక్షల మంది భక్తులు…

కుంభమేళాకు 28 లక్షల మంది భక్తులు…
-హరిహర ఘోషతో మార్మోగిన త్రివేణి సంగమం
-కోవిద్ ను లెక్క చేయని భక్తులు
-మాస్క్ లు ధరించాలని అధికారుల హెచ్చరికలు
-గంగ నదిలో పవిత్ర స్నానాలు
సంవత్సర కాలంగా కోవిద్ మహమ్మారితో కాలం గడుపుతున్న ప్రజలు మహాకుంభమేళా సందర్భంగా ఒక్క సారిగా బయటకు వచ్చారు.శివరాత్రికి శివాలెత్తిన చందంగా భక్తి ప్రపత్తులను చాటుకునేందుకు త్రివేణి సంగమం బాట పట్టారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లడాయి. ప్రధానంగా ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పిలవబడే మహాకుంభమేళా జరిగే హరిద్వార్ భక్తుల శరణఘోషతో మారుమోగింది. సుమారు 28 లక్షల మంది భక్తులు ఒక్క హరిద్వార్ లోనే పుణ్య స్నానాలు ఆచరించించినట్లు అధికారులు తెలిపారు. భక్తులతో హరిద్వార్ విధులన్నీ ఇసుకేస్తే రాలనంతగా మారిపోయాయి . ఈ సందర్భంగా కోవిద్ నిబంధనలను పాటించాలని , భక్తులంతా మాస్క్ లు ధరించాలని పోలిసుల హెచ్చరికలు చేశారు.దూరం పాటించాలని , పుణ్యస్నానాలు కేవలం మూడు మునకలు వేయాలని మైకుల ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేయటం జరిగింది. హరిద్వార్ వచ్చే భక్తులు కోవిద్ మహమ్మారి ఉన్నందున ఆర్ టి -పి సి ఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకొని రావాలనే నిబంధనలు పెట్టారు. హరిద్వార్ కు వచ్చే భక్తులకు ర్యాండమ్ గా తనిఖీలు చేపట్టారు. వందలాది ఘాట్లను స్నానాలకు వేర్పాటు చేయడంతో దగ్గర్లో ఉన్న ఘాట్లకు మాత్రమే వెళ్లాలని పోలీసులు నిరంతరం ప్రకటనలు చేశారు . ఎక్కువ సార్లు మునగకండి .కేవలం మూడుసార్లు మాత్రమే మునిగిన రారువాత అక్కడనుంచి ఖాళీ చేయాలనీ ప్రకటించారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. భక్తులు ఉత్సహం ,ఉత్తేజం , కనిపించింది.పూలు ,పూలదండలు ,నీటిజల్లులతో హరిద్వార్ పులకించింది. కొత్తగా ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరించిన తీర్థ సింగ్ రావత్ హరిద్వార్ సందర్శించారు. 5 వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.పరిశుభ్రత ,శానిటైజేసాటిన్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మహిళల స్నానాల కోసం ప్రత్యేక ఘాట్ లను ఏర్పాటు చేయటంతో పాటు దుస్తుల చేంజ్ రూమ్ లు ఏర్పాటు చేశారు.మొత్తం హరిద్వార్ ను 25 సెక్టార్ లుగా విభజించారు . 10 మొబైల్ టోయిలెట్ లు , 150 ప్రత్యేక ఘాట్ లు 50 మంది శానిటైజర్ తో ప్రజలకు శానిటైజ్ అందజేశారు. సీసీటీవీ లు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సహాల ప్రత్యేక అధికారి దీపక్ రావత్ తెలిపారు .
దేశంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట లడాయి. కాశీలోని విశ్వేశ్వర ఆలయం భక్తులతో కిటకిట లాడింది.సోమనాథ ఆలయం, వేములవాడ , కాళేశ్వరం , ధర్మపురి, కోటప్ప కొండ లాంటి క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి.

Related posts

తరచూ వాడే ఈ మందులకు ఇక డాక్టర్ చీటీ అక్కర్లేదు..

Drukpadam

The Wirecutter’s Best Deals: Save $50 on Apple’s 10.5-inch iPad Pro

Drukpadam

హుజూరాబాద్ లో తొలిసారి టీఆర్ఎస్ కు లీడ్.. ఎంతంటే..

Drukpadam

Leave a Comment